తెలంగాణ

బడ్జెట్‌పై సందేహాలు తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చాలా సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉందని కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ చివరి రోజూ బడ్జెట్ పద్దులపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2000-2001 ఆర్థిక బడ్జెట్‌లో చూపించిన పద్దుల వివరాలు పరిశీలిస్తే మంచిగా అనిపిస్తోందన్నారు. అయితే వాస్తవంగా బడ్జెట్‌లో చూపించిన నిధులు ఖర్చు చేస్తారా అన్న సందేహాలు ఉన్నాయన్నారు. వీటికి కారణాలను ఆయన లేవనెత్తారు. 2014 నుంచి 2019 వరకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చూపించిన విధంగా నిధులను ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. కొత్త బడ్జెట్‌లో లక్షా 82వేల కోట్లుతో ప్రభుత్వం రూపొందించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. అనుకున్న ప్రకారం రాబడి వస్తే నిధులు ఖర్చు చేయవచచ్చునని, రాబాడి తగ్గిపోతే పరిస్థితి ఏమిటని సీఎంను ప్రశ్నించారు. పన్నుల వసూళ్లలో వెనకబడితే ఏ రంగంపై కోతలు పెడతారన్నారు. రాబడి దగ్గితే అభివృద్ధి పనులు ఎలా ముందకు పోతాయని ఆయన నిలదీశారు. మిషన్ భగీరథ పతకం ద్వారా గ్రామీణ ప్రాంతల్లో ఇంటింటికీ మంచినీరు ఇస్తామని సీఎం గొప్పలు చెప్పుకోవడం జరుగుతోందన్నారు. మధిర అసెంబ్లీలో ఒక గ్రామంలో మంచినీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తాము సూచిస్తే తమపై దండెత్తడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కనె్నర్ర చేయడం భావ్యం కాదన్నారు. గ్రామ సర్పంచ్‌లతో తీర్మాణాలు చేయిస్తున్న ఘటనలను తాము సభ దృష్టికి తీసుకువస్తే ఆశ్చర్యం ఏముందీ అంటూ వ్యగ్యంగా మాట్లాడడం ఏమిటని ఆయన నిలదీశారు. ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం మేము చేసిన తప్పా అంటూ ఆయన ప్రశ్నించారు. దేశానికి కాంగ్రెస్సే కరోనా అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ అసెంబ్లీలో హుందాగా వ్యహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే అటుగా ప్రయత్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని ఆయన తప్పుపట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బెల్ట్‌షాపులు ఏర్పాటుతో పేదవాళ్లు బతుకులు దెబ్బతింటాయన్నారు. సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాల్లో లెక్కలు చెప్పకుండా ప్రభుత్వం తప్పించుకుటోందని ఆయన ఆరోపించారు.