తెలంగాణ
వ్యవసాయ మార్కెట్లలో పరిశుభ్రత పాటించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 16: కరోనా ఉధృతంగా ఉండటం వల్ల రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులు, మార్కెట్ సిబ్బంది, వ్యాపారులు, కూలీలు తదితరులతో రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కారణంగా ఎవరికీ కరోనా సోకకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ శాఖ అధికారులతో మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మార్కెట్లలో మంచినీటి కేంద్రాలు, ఆహార కేంద్రాలు, మరుగుదొడ్ల వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. హమాలీలు, రైతులు, చాటకూలీలు తదితరులు ఒకే చోట గుమికూడకుండా చూడాలని ఆదేశించారు. రైతులు ఉదయమే మార్కెట్లకు వస్తుంటారని, అందువల్ల వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు నీళ్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
అన్ని వ్యవసాయ మార్కెట్లలో మైకుల ద్వారా నిరంతరం జాగ్రత్త చర్యలు పాటించాలంటూ ప్రచారం చేయాలని ఆదేశించారు. మార్కెట్లలో వాల్‌పోస్టర్లు కూడా వేయాలన్నారు.