రాష్ట్రీయం

‘గాంధీ’లో మరో 22 మంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సికిందరాబాద్, మార్చి 16: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాలుగుకి చేరింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెంది న ఓ మహిళ, ఇటలీ స్కాట్‌లాండ్‌కు చెందిన ఇద్దరు ఉండగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరొకరు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. తాజాగా సోమవారం మరో 22 మంది అనుమానితులను గాంధీ ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఈ ఒక్కరోజే 62 మంది బాధితులు దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి రాగా, వారిలో 22 మందిని మాత్రమే వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకుని మిగిలిన వారికి కౌనె్సలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ప్రస్తుతం గాంధీ ఆసుపల్రోని ఐసోలేషన్ వార్డు ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చిన బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, వారంతా క్రమంగా కోలుకుంటున్నట్లు సమాచారం. సోమవారం నాటికి అనుమానితులు 25 మంది కాగా, పాజిటివ్ బాధితుల సంఖ్య నాలుగుకు పెరిగింది. తాజాగా చేరిన 22 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. గాంధీలో పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చిన రిపోర్టులను పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపి ఖరారు చేసుకోనున్నారు.
ఇక నేరుగా క్యారెంటైన్‌కే..
నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు నగరానికి వివిధ దేశాల నుంచి వస్తున్నవారే ప్రధాన కారణమన్న విషయాన్ని ఆలస్యంగానైనా గుర్తించిన అధికారులు ఇకపై విదేశాల నుంచి వచ్చే వారిని ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా క్యారంటైన్ కేంద్రానికి తరలించనున్నారు. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అక్కడి నుంచే క్యారంటైన్ కేంద్రానికి తరలించనున్నారు. క్యారెంటైన్ కేంద్రంలో కరోనా వైరస్ లక్షణాలేమైనా కన్పిస్తే, అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ ప్రయత్నం అనుకున్నట్టుగా ఫలిస్తే నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత బాగా తగ్గే అవకాశముంటుంది.
*చిత్రాలు.. . కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం గాంధీ ఆసుపత్రిలో మాస్క్‌లు ధరించి వచ్చిన రోగులు, ఆసుపత్రి సిబ్బంది