తెలంగాణ
సీఏఏపై సమీక్షించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 16: భారతదేశంలోని అనేక మంది ప్రజల్లో భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ శాసనసభ, ఏదేనీ మతం లేదా ఏవేనీ విదేశాలకు సంబంధించిన నిర్దేశాలన్నింటినీ తొలగించడానికి వీలుగా 2019 పౌరసత్వ సవరణ చట్టాన్ని మరోమారు సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ శాసనసభ సోమవారం నాడు ఏకగ్రీవ తీర్మానం చేసింది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈ మేరకు ఒక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగిస్తూ పౌరసత్వ చట్టం (సీఏఏ), ఎన్‌పీఆర్, ఎన్‌సీఆర్‌ల నేపథ్యాన్ని, దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులను, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోందో చెప్పారు. భారీ సంఖ్యలో ప్రజలను మినహాయించే ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ ప్రతిపాదిత అమలుపై సభ ఆందోళన వ్యక్తం చేస్తోందని అన్నారు. ఈ చట్టం వల్ల ప్రపంచంలో భారత్‌కు చెడ్డపేరు వస్తుందని, సీఏఏ అనేది కేవలం ముస్లింల సమస్య కాదని, యావత్ దేశ సమస్య అని ఆయన అన్నారు. కేంద్రం తీరుతో దేశ ప్రతిష్ట గంగలో కలిసిందని సీఎం వ్యాఖ్యానించారు. దేశ భవితకు ఈ చట్టం మంచిది కాదని, ఈ చట్టం వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు. చట్టం చేసే ముందు అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాల్సిందిపోయి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ న్యూసెన్స్ సరికాదని చెప్పారు. దేశంలో ఈ టెన్షన్లు మంచిది కాదని, తనకే పుట్టిన సర్ట్ఫికెట్ లేదని, ఆనాడు ఆస్పత్రులు లేవని, అలాంటిది సామాన్యుడి పరిస్థితి ఏమిటని సీఎం ప్రశ్నించారు. నోరులేని మహిళలు, అనాథలు, సంచారజాతులు నిరక్షరాస్యులు సర్ట్ఫికెట్లు తెమ్మంటే ఎక్కడి నుండి తెస్తారని సీఎం ప్రశ్నించారు. చొరబాటుదారులను అనుమతించమని తా ము చెప్పడం లేదని, ప్రతిదానికీ ఒక పద్ధతి, విధానం ఉం టుందని, ఎపుడో భారతదేశానికి వచ్చి జీవిస్తున్న కాందిశీకులను ఇపుడు కాదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. వాజపేయి ప్రధానిగా ఉన్నపుడే ఈ చట్టంపై చర్చ జరిగిందని, ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో డాటా సేకరించి చివరికి ఇది సాధ్యం కాదని చేతులెత్తేశారని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్ట్ఫికెట్లు ఏవీ చెల్లవని అంటున్నారని, పుట్టిన తేదీ సర్ట్ఫికెట్ తెమ్మంటే ఎవరు తీసుకురాగలుగుతారని ఆయన అన్నారు. సీఏఏకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా దేశద్రోహి అంటున్నారని, అసెంబ్లీ తీర్మానం చేసింది కనుక అసెంబ్లీ కూడా దేశద్రోహి అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎంతో తాము కలిసి పనిచేస్తున్నామని, అంత మాత్రాన వారి సిద్ధాంతాలన్నింటినీ తాము సమర్థిస్తున్నట్టు కాదని, కొన్నిమార్లు వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తామని, మరికొన్నిమార్లు వారి అభిప్రాయాలతో విభేదిస్తున్నామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దును
తాము సమర్ధించామని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై కూడా సీఏఏ గురించి చర్చ జరగడం మంచిది కాదని, భయపెట్టే రీతిలో కాకుండా అందర్నీ నచ్చచెప్పి నేషనల్ కార్డులను జారీ చేయవచ్చని, అందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను, ప్రముఖులను, నిపుణులను ఆహ్వానించి సమావేశం పెట్టి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ తీర్మానం
సీఏఏ సమానత్వాన్ని, లౌకికవాదాన్ని ఉల్లంఘించడమేగాక, సరైన డాక్యుమెంట్లు లేని పౌరుల జీవితాలు అపాయంలో పడతాయని తీర్మానంలో పేర్కొన్నారు. సీఏఏ తర్వాత ఎన్‌పీఆర్, ఆ తర్వాత ఎన్‌సీఆర్‌లకు కేంద్రం సిద్ధం అవుతోందని, పత్రాలు ఇవ్వనివారు దేశ పౌరులుగా గుర్తింపు పొందరని పేర్కొన్నారు. బహుళ సాంస్కృతిక విభిన్నతలున్న తెలంగాణ రాష్ట్రం రాజకీయ, సాంస్కృతిక మతపరమైన వర్గాలు సీఏఏకు వ్యతిరేకంగా శాంతియుత ధర్నాలకు వేదిక అయ్యిందని చెప్పారు.
*చిత్రం... ముఖ్యమంత్రి కేసీఆర్