తెలంగాణ

పన్నులు పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంక్షే మం, అభివృద్ధి రంగాలను ప్రజ ల వద్దకు చేర్చడానికి పన్నులు పెంచక తప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2020-2021 ఆర్థిక బడ్జెట్ తెలంగాణ సమాజానికి దిశ, దశ నిర్ధేశించే విధంగా ఉందన్నా రు. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి మద్యం, ఆర్టీసీ, విద్యుత్, గనులు, ఇసుక, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ (్భ కొనుగోలు, అమ్మకాలు)లపై పన్నులు పెంచుతామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారిగా ఉన్నాం కాబ ట్టే పన్నులను ధైర్యంగా పెంచుతున్నామని ఆయన విస్పష్టంగా చెప్పారు. అబద్ధాలు, మోసాలు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారన్నారు. అధికార పార్టీపై ప్రజ ల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రభుత్వం సర్వేలు చేయిస్తుంటుందని
ఆయన చెప్పారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి ప్రభుత్వం తన విధానాలను మార్చుకుంటుందని సీఎం అన్నారు. అధికార, ప్రతిపక్షాలకు ఎవరి విధానాలు వారికి ఉంటాయని, అయితే అంతిమంగా ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సి ఉంటుందని సీఎం నొక్కి చెప్పారు. అధికార పార్టీని చట్టసభల్లో కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడడం మంచిది కాదన్నారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరిస్తే తెరాస కూడా అదేవిధంగా స్పందిస్తుందన్నారు. అవాకులు చవాకులు, వాగ్వాదాలు, తగాదాలతో కిరికిరులు అసెంబ్లీ బయట బాగుంటాయని, కానీ రాష్ట్రానికి దిశ, దశ నిర్ధేశించే అసెంబ్లీ లోపల ఇరుపక్షాలు హుందాగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారని సీఎం చెప్పారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శనాత్మకంగా మాట్లాడితే ప్రజల మెప్పుపొందుతారని, భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించే నిధులపై కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్ వాళ్లు ఖర్చుల వివరాలు, లెక్కలు చెప్పడం లేదని విమర్శించడం సరికాదన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లుగా పనిచేస్తాయన్నారు. కేంద్రం మంత్రులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పొగడ్తలతో ముంచెత్తుత్తుంటే, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నుంచి మాత్రం ఒక్క పొగడ్తాలేదన్నారు. తాము సన్నాసులం కాదని, తమను పనికట్టుకుని విమర్శిస్తే మాత్రం ఎంతకైనా ముందుకు పోతామని సీఎం హెచ్చరించారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధి చూస్తే తెలంగాణ అభివృద్ధి మస్తుగా పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నల్లగొండ చివరి ఆయకట్టుకు తీసుకువచ్చిన ఘనత తెరాసకు దక్కిందన్నారు. సాగునీరు కాలువల ద్వారా అద్భుతంగా ప్రవహిస్తుంటే కాంగ్రెస్ నేతలకు కన్పించలేదా అంటూ సీఎం ప్రశ్నించారు. విజయ డైరీని కాంగ్రెస్, టీడీపీ పతనావస్థకు చేర్చాయన్నారు. చివరికి డైరీని రూ.30 కోట్ల అప్పుల ఊబిలోకి దించారని సీఎం ధ్వజమెత్తారు. ప్రస్తుతం విజయ డైరీ లాభాల వైపు నడుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాడి రైతులుకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రూ.4 రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తోందన్నారు. తెరాస హామీ నిలబెట్టుకోలేక పోయుంటే రైతులు తమను నిందించేవారన్నారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్, బీజేపీ దొందూదొందుగా వ్యవహరించాయన్నారు. కందులకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కందులు కొనడానికి రూ. 300 కోట్లు విడుదల చేసిందని సీఎం గుర్తు చేశారు. పంటకు మద్దతు ధర కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని ఆయన గుర్తు చేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. కందులు కొనుగోలుపై కేంద్రం పెద్ద డ్రామా ఆడుతోందని సీఎం కనె్నర్ర చేశారు. రాష్ట్రాలపై కేంద్రం గుత్త్ధాపత్యం చేస్తోందని, దీనిని విడనాడకపోతే భవిష్యత్‌లో కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో పండించని విధంగా తెలంగాణలో దాదాపు 2.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత దక్కిందన్నారు. వ్యవసాయంలో అద్భుతమైన మార్పు వచ్చిందన్నారు. తెలంగాణ సోనా బియ్యం పంట పండించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ వాటాగా కేంద్రానికి 2,72,926 కోట్లు పన్నుల రాబడి తీసుకుంటోందని, అయితే రాష్ట్రానికి ఇచ్చేది మాత్రం 1.12 లక్షల కోట్లు అంటూ సీఎం లెక్కలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పు మరో రెండేళ్లలో తీర్చుతామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1.35 లక్షల కోట్లు ఉంటే, నేడు తెలంగాణలో అంతే బడ్జెట్‌ను ఖర్చు చేశామన్నారు. గతంలో మద్యం నిషేధించిన ముఖ్యమంత్రులు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అమలు చేయడంలో అట్టర్‌ఫ్లాప్ అయ్యారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాల సరిహద్దులు వందల కిలోమీటర్ల దూరం ఉన్నాయని, మద్యం నియంత్రించడానికి వీలు కాదన్నారు. పోడు భూముల విషయాన్ని తేల్చడానికి తాను ఒక్కడినే పోతే కుదరదని తనతో పాటు ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి పరిశీలిస్తామన్నారు. గోదావరి నది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 530 టీఎంసీల నీటిని తెలంగాణ బీడు భూములకు పారిస్తానన్నారు. గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, వాటికి సంబంధించిన పత్రాలు ఉంటే తాను రాజీనామాకు సిద్ధమని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. నిరుద్యోగులను మోసగించే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు విడనాడాలని ఆయన హితవు పలికారు. హైదరాబాద్‌తో పాటు నగర శివారులో మంచినీటి దాహం తీర్చడానికి రూ.10వేల కోట్లు ఖర్చు చేయడాకి తమ ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తోందన్నారు. అసత్యాలతో తెలంగాణ సమాజాన్ని దెబ్బతీసే విధంగా తెరాస వ్యవహరించదని సీఎం సభకు హామీ ఇచ్చారు.