తెలంగాణ
సీఏఏపై తీర్మానానికి సభ ఆమోదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం లో సవరణలు కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శాసనసభలో సోమవారం ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. చర్చలో చివరగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతుండగా ఒక దశలో స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. పోడియంలోకి వెళ్లిన బీజేపీ సభ్యుడు రాజాసింగ్ స్పీకర్‌తో గట్టిగా మాట్లాడుతుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం
చేసుకుంటూ ‘గో బ్యాక్ టూ యువర్ సీట్’ అంటూ రాజాసింగ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. తీర్మానాన్ని పాస్ చేయండి అంటూ సీఎం ఆ తర్వాత కోరారు. దాంతో స్పీకర్ పోచారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ ముగిసిందని, సభ ఆమోదించాలని సూచించారు. మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. తీర్మానం పాస్ అయిందని ప్రకటించిన స్పీకర్ సభను భోజన విరామం కోసం వాయిదా వేస్తున్నట్టు మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రకటించి వెళ్లిపోయారు.