తెలంగాణ

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలిపారు. సమాచార, పౌరసబంధాల పద్దులపై శాసనసభలో ఆదివారం మాట్లాడుతూ, జర్నలిస్టుల పక్షపాతిగా సీఎం పనిచేస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారన్నారు. జర్నలిస్టులకు గతంలో కేవలం అక్రిడిటేషన్ మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. మొట్టమొదటి సారి 100 కోట్ల రూపాయలు మీడియా అకాడమీకి కేటాయించారని క్రాంతి గుర్తు చేశారు. ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం తాపత్రయపడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో జర్నలిస్టుల ఇళ్లస్థలాల అంశం పెండింగ్‌లో ఉందని, సుప్రీంకోర్టులో ఈ అంశంపై కేసు నడుస్తుండటమే ఇందుకు కారణమన్నారు. జిల్లాల్లో చాలా చోట్ల ఇళ్లస్థలాలు ఇచ్చారని, మెదక్, మహబూబాబాద్, ఆదిలాబాద్, భూపాల్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇచ్చారన్నారు. సిర్సిల్లాలో ఇళ్లను నిర్మించి ఇచ్చారని, సిద్ధిపేటలో డబల్‌బెడ్‌రూం ఇళ్లను ఇచ్చారన్నారు. మహబూబ్‌నగర్‌లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వరంగల్ జిల్లాలో ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు డబల్‌బెడ్‌రూం ఇళ్లను ఇచ్చేందుకు ఒక పాలసీని తీసుకువస్తే బాగుంటుందని క్రాంతికిరణ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకోసం చేపట్టిన సంక్షేమ పథకాలను పరిశీలించేందుకు వేర్వేలు రాష్ట్రాల నుండి మీడియా అకాడమీ ప్రతినిధులు మన రాష్ట్రానికి వస్తున్నారన్నారు. వివిధ పత్రికలకు అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా 867.44 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని క్రాంతి కిరణ్ గుర్తు చేశారు. ప్రభుత్వం నుండి ఇంత పెద్ద మొత్తంలో పత్రికలకు డబ్బులు లభిస్తున్నప్పటికీ, యాజమాన్యాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అడ్వర్టైజ్‌మెంట్ల డబ్బులను ప్రభుత్వం ఇచ్చే సమయంలోనే 10 శాతం నిధులను సెస్ రూపంలో వసూలు చేసి జర్నలిస్టుల సంక్షేమం కోసం వాడితే బాగుండేదన్నారు.