తెలంగాణ

‘కరోనా’పై హై అలర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఉండే వ్యక్తులకు కరోనా సోకకపోయినా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారి నుంచి
ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, పొరుగు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ అధికారులు, విద్యాశాఖ అధికారులతో కరోనాపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో పాటు పొరుగు రాష్ట్రాలు కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్ విశ్వనగరం కావడంతో ప్రతిరోజూ దేశ, విదేశాల నుంచి వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని, వారి వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదని అధికారులు వివరించారు. రాష్ట్రంలో కరోనా అనుమానితులుగా నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికేనని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమై తీసుకుంటున్న చర్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు చివరి దశకు చేరుకోవడంతో మిగిలిన పరీక్షలను యథాతథంగా నిర్వహించడమే మేలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఇంటర్ ఫలితాలతో అనేక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు ముడిపడి ఉండడంతో వీటిని యథాతథంగా కొనసాగించడమే మేలని సూచించారు. లేనిపక్షంలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందనే అధికారులు సూచించారు. దీంతో పాటు ఎస్‌ఎస్‌సీ పరీక్షలు కూడా త్వరలో ప్రారంభం కానుండడంతో ఇంటర్ మాదిరిగా వాటిని కూడా కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. శాసనసభ సమావేశాలు బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయించిన మేరకు ఈ నెల 20 వరకు జరగాల్సి ఉండడంతో వీటిని కూడా కుదించడమే మేలని సీఎం సూచించారు. అయితే బడ్జెట్ ఆమోదం పొందడానికి ముందు బడ్జెట్ పద్దులన్నీ అమోదం పొందడంతో పాటు చివరగా ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం అనివార్యం కావడంతో సమావేశాలను వీలైనంత త్వరగా ముగించడానికి ఉన్న అవకాశాలపై శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు అభిప్రాయాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల బడ్జెట్ పద్దులు ఆమోదించుకోవడానికి ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కూడా శాసనసభను నిర్వహించుకుంటే సోమవారం ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవచ్చని కార్యదర్శి సూచించారు. దీంతో ఆదివారం కూడా శాసనసభను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం సూచనల మేరకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారానికి వాయిదా వేశారు. అలాగే మళ్లీ 20న సమావేశం కావాల్సిన శాసనమండలి సమావేశాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారానికి వాయిదా వేశారు.