తెలంగాణ

31వరకూ అన్నీ మూతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు (స్కూల్స్ నుంచి యూనివర్సిటీల వరకు), సినిమా థియేటర్లు, బార్లు, క్లబ్‌లు, పబ్‌లు మూసివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలకు కూడా అనుమతి లేదని హెచ్చరించింది. ఈ నిషేధాజ్ఞలు శనివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. కరోనాపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, పొరుగు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. అనంతరం ఈ నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. వారం, రెండు వారాల పాటు వేర్వేరుగా అమలులో ఉండే నిషేధాజ్ఞలను ప్రకటించారు. విద్యాసంస్థలను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినప్పటికీ ఇంటర్, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు యథతథంగా కొనసాగుతాయని ప్రకటించారు. ముందుగా ఖరారైన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఈ నెల 31 వరకే అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఫంక్షన్ హాల్స్ కూడా మూసివేస్తామన్నారు. మార్చి 31 తర్వాత జరిగే కార్యక్రమాలకు ఎలాంటి బుకింగ్‌లు ఉండవని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అయితే షాపులు, మాల్స్ ఎప్పటిలాగా పనిచేస్తాయని అన్నారు. ఆర్టీసీ బస్సులు,
మెట్రోరైళ్లు యథావిధిగా నడుస్తాయన్నారు. విద్యాసంస్థలకు బంద్ ప్రకటించినప్పటికీ హాస్టల్స్‌లోని విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, మ్యూజియంలు, ఎగ్జిబిషన్లు, స్విమ్మింగ్ పూల్స్, క్రీడలు, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, సంస్కృతిక కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితిలోనూ అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
రాష్ట్రంలో కరోనా ఎవరికీ రాలేదని, విదేశాల నుంచి వచ్చిన వారినే అనుమానితులుగా పరీక్షలు చేసి చికిత్సలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని చెప్పారు. దీని కోసం రూ.500 కోట్లు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉంచామన్నారు. కరోనా వైరస్ అనేది దేశంలో పుట్టింది కాదని, విదేశాల నుంచి వచ్చిందేనన్నారు. దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేకపోయినా ముందస్తు చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో ఒకే ఒక విమానాశ్రయం ఉండటంతో విదేశాల నుంచి వచ్చే వారి నుంచి ఈ వైరస్ వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నగరంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఈ వైరస్ సోకే అవకాశమే ఉండదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. అలాగే మీడియా కూడా సంయమనం పాటించాలని, వైద్యశాఖ నిర్ధారించకుండా తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
*చిత్రం... మంత్రి మండలి అత్యవసర సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్