తెలంగాణ

అమిత్ షా రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఢిల్లీలో అల్లర్ల వెనుక మత ఛాందసవాదుల ప్రమేయం ఉందని సీపీఐ నేతలు గురువారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో అల్లర్లకు, అల్లకల్లోలానికి కారణమైన హోం మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంతకు ముందు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషాల ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ నుండి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వై జంక్షన్ వద్ద హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఢిల్లీ తగులబడుతుంటే మోదీ ,అమిత్ షా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా ఆపరేషన్ ప్రకారం గుజరాత్‌లో చేసిన విధంగా మతకలహాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా సైన్యం ఆన్ గోయింగ్ ప్రాజెక్టే ఈ విధ్వంసం అని అన్నారు. ఉద్ధేశ్యపూర్వకంగా హోం మంత్రి పేర సైన్యం తయారుచేసి అల్లకల్లోలానికి పాల్పడుతున్నారని అన్నారు. అమిత్ షా రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అమిత్ షా, నరేంద్రమోదీల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లిందని అన్నారు. తక్షణమే కేంద్ర మంత్రి బాధ్యతల నుండి ఆయనను తప్పించాలని అన్నారు. అజీజ్ పాషా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీని విడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ నేతల ప్రసంగాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. ఢిల్లీలో ప్రశాంత వాతావరణాన్ని నెలకోల్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు సీపీఐ నేతలను కార్యకర్తలను అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. డాక్టర్ నారాయణ, చాడ వెంకటరెడ్డి, సయ్యద్ అజీజ్ పాషాతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, ఎన్ బాలమల్లేష్, కే శంకర్, డాక్టర్ డీ సుధాకర్, మహిళా సమాఖ్య నేత ఎన్ జ్యోతి, అనిల్ కుమార్, పల్లె నర్సింహా, వెంకటరెడ్డి, రాజేష్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేసి అబిడ్స్ స్టేషన్‌కు తరలించారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకులు