తెలంగాణ

టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా పోలీసులు: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల మాదిరి వ్యవహరిస్తున్నారని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయ ఆరోపించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఖాకీ చొక్కా వదిలి పింక్ షర్టు వేసుకున్నట్టు వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. నారాయణ కాలేజీలో బిడ్డ చనిపోయి ఆవేదనలో ఉన్న తండ్రి కన్నీరుమున్నీరై ఏడుస్తుంటే ఆయనను బూటుకాలితో తన్నడమేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. పోలీసుల తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రజల పక్షాన నిలవాల్సిన పోలీసులు టీఆర్‌ఎస్ నేతలకు సలాం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ పోలీసుల తీరును ట్విట్టర్‌లో ప్రశ్నించిన కేటీఆర్‌కు తెలంగాణ ఘటనలు కనిపించవా అని విజయ నిలదీశారు. ఆదిలాబాద్‌లో ఎస్సీ బిడ్డపై అఘాయిత్యం జరిగితే పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో అనేక మిస్సింగ్ కేసులు నమోదవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాటలు అభ్యంతరకరం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ వీ సుభాష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా భారత పార్లమెంటులో చేసిన చట్టాన్ని రాష్ట్ర శాసనసభ్యుడిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయదని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ముస్లిం సంతుష్టీకరణ విధానంలో భాగంగా శాసనసభ్యుడు అలా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. పాక్, ఆఫ్గన్, బంగ్లాదేశ్‌ల నుండి అక్రమంగా తెలంగాణ వచ్చిన వారిని వెళ్లగొట్టే పరిస్థితి లేదని వారికి అండగా ఉంటామని ముస్లిం పౌరసత్వం ఇవ్వాలంటున్న టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు.
గాంధీపై పోలీసులకు ఫిర్యాదు
గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ కన్వీనర్ పి బుచ్చిరెడ్డి, జీ యోగానంద్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ