తెలంగాణ

మానవీయ కోణంతో పనిచేయాలి: డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో పోలీసు అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ మానవీయ కోణంలో విధులు నిర్వహించాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పఠాన్‌చెరులో బుధవారం కానిస్టేబుల్ చేసిన అనుచిత ప్రవర్తన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో గురువారం సాయంత్రం డీజీపీ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రతీ పోలీస్ అధికారి ప్రజలే తమ యాజమానులనీ, తాము ప్రజల సేవకులమనే వౌలిక విషయాన్ని నిరంతరం పరిగణలోకి తీసుకోవాలని డీజీపీ సూచించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు స్వీయ క్రమశిక్షణతో భాద్యతాయుతంగా ప్రవర్తించాలని తెలిపారు. లకిడికాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన విడియో కాన్ఫరెన్స్‌లో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...రాష్ట్రంలోని పోలీసు అధికారులు, సిబ్బందితో జరిగిన విడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి