తెలంగాణ

పెన్షనర్ల సమస్యలు పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: పెన్షనర్ల సమస్యలను పట్టించుకుని వాటిని పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా హక్కుల సాధనకై ఐక్యపోరాటానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వారు చెప్పారు. మార్చి 1వ తేదీన బీసీ సాధికారత భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్టు నేతలు తెలిపారు. ఈ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాల రాష్ట్ర నేతలను ఆహ్వానిస్తున్నట్టు వారు తెలిపారు. రాష్ట్రంలో 2018 జూలై 1 నుండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు సవరణ జరగాల్సి ఉందని, సీఎం 2018 మే 16న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జరిపిన సమావేశంలో జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తామని, ఆగస్టు 15 నాటికి పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారని ఆ హామీలు ఇంత వరకూ నెరవేరలేదని వారు పేర్కొన్నారు.