తెలంగాణ

బడ్జెట్‌లో పొదుపు మంత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మార్చి మొదటి వారంలో ప్రారంభం అవుతుందని భావిస్తున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలపై గురువారం ప్రగతి భవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష జరిపారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను సమీక్షిస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు సీఎం వివరించారు. బడ్జెట్ రూపకల్పనపై దిశా నిర్దేశం చేశారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్రంపై పడిన దాని ప్రభావాన్ని బడ్జెట్ రూపకల్పన సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించినట్టు తెలిసింది. ముఖ్యంగా దుబారా ఖర్చులకు కళ్లెం వేయడంతో అవసరమైన వాటికే నిధులు కేటాయించేలా పొదుపు మంత్రాన్ని పాటించాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్త హామీలకు స్వస్తి పలికేలా చర్యలు ఉండాలని సూచించారు. ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయింపులు ఉండాలని సూచించినట్టు తెలిసింది. ఆర్థిక మాంద్యం వల్ల తగ్గిన రాష్ట్ర సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి వల్ల సమకూరే నిధులపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వ భూముల వేలంతో పాటు భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడం ద్వారా పెరిగే ఆదాయం, ఆస్తి పన్నుతో పాటు ఇతర పన్నులను పెంచడం ద్వారా ఎంత మేరకు ఆదాయం పెరుగుతుందనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఇలా ఉండగా శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించే తేదీలతో పాటు బడ్జెట్ ప్రవేశ పెట్టేరోజు, ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదించే తేదీలపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరైనట్టు సమాచారం.