తెలంగాణ

తెలంగాణకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరా రు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకుంటున్న
చర్యలు, పెట్టుబడుల సమీకరణకు చేస్తున్న ప్రయత్నాలను, ఆ దిశగా ఇంత వరకు సాధించిన విజయాలను కేటీఆర్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాధాన్యతలను సుబ్రహ్మణ్యన్ వివరించారు. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రం సాధించిన అభివృద్ధిని మంత్రి కేటీఆర్ వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూత ఇవ్వాలని సూచించారు. ఇలా ఉండగా సుబ్రహ్మణ్యన్ గతంలో హైదరాబాద్ ఐఎస్‌బీలో పనిచేస్తున్న నాటి నుంచి తనకు మంచి సంబంధాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సుబ్రహ్మణ్యన్ ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

*చిత్రం...కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్‌కు జ్ఞాపిక అందజేస్తున్న కేటీఆర్