తెలంగాణ

వ్యాపార సంస్థలకు ఆలయ భూముల లీజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, ఛారిటబుల్ సంస్థల భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు. దేవాదాయ భూములు ఆక్రమణలకు గురికాకూడదన్నది ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అలాగే ఖాళీ స్థలాల వల్ల ఎలాంటి ఆదాయం లేని చోట వ్యాపార సంస్థలకు ఈ భూములను లీజుకు ఇవ్వడం వల్ల ఆలయాలకు ఆదాయం కూడా సమకూరుతోంది. ఇందులో బాగంగానే మహబూబాబాద్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవాయానికి (శివాలయం) చెందిన 2000 చదరపు అడుగుల భూమిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్‌కు అప్పగించారు. అలాగే హన్మకొండలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించిన 1500 చదరపు అడుగుల భూమిని కూడా హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు లీజుకు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం జీఓ జారీ అయింది.