తెలంగాణ

వైభవంగా యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యా దాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం కొండపైన బాలాలయంలో పాంచరాత్రాగమశాస్త్రానుసారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి నూ తన ఆలయం నిర్మాణంలో ఉన్నందున బ్రహ్మోత్సవాలను బాల ఆలయంలోనే నిర్వహిస్తున్నారు. యాజ్ఞీకులు, స్థానాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కా రంపూడి నరసింహాచార్యుల యాజ్ఞిక, అర్చక పండిత బృందం వేద మంత్రోచ్ఛారణలు, పారాయణాల మధ్య ఉద యం 10 గంటలకు శ్రీ విశ్వక్సేనారాధన, స్వస్తివచనం, రక్షాబంధనంతో బ్ర హ్మోత్సవాలకు
శ్రీకారం చుట్టారు. సాయంత్రం ఉత్సవాల నిర్వహణలో భాగంగా మత్యంగ్రహణం, అంకురారోపణం కార్యక్రమాలను శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో మార్చి 4వ తేదీన స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 28 నుండి మార్చి 5వ తేదీ వరకు స్వామివారి విశేష అలంకార, వాహన సేవల నిర్వహణకు, మార్చి 2నుండి 7 వరకు నిర్వహించే ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలకు ఏర్పాట్లు చేపట్టారు. కాగా, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు గురువారం ఉదయం 11 గంటలకు బాల ఆలయంలో ధ్వజారోహణం, సాయంత్రం 6 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

*చిత్రం... పూజల్లో భాగంగా స్వస్తివచనం పలుకుతున్న దృశ్యం