తెలంగాణ

పనిచేయకపోతే ఇక ఇంటికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఫిబ్రవరి 25: నూతన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కౌన్సిలర్లు, అధికారులు పని చేయకపోతే పదవులను కోల్పోవడం ఖాయమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అలాగే వార్డు కమిటీ సభ్యులు వార్డులో నెలకొన్న సమస్యలపై నెలకోసారి వార్డులో సమావేశమై చర్చించాలని సూచించారు. వాటిని కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిలర్ల బాధ్యత ఏంటో తెలుసుకోవాలని కౌన్సిలర్లకు సూచించారు. దేవరకొండ పట్టణంలోని హనుమాన్ నగర్, అయ్యప్పనగర్‌లలో తాను పర్యటించినప్పుడు పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో 8 వేల ఇళ్లు ఉన్నాయని కమిషనర్ పూర్ణచందర్‌రావు చెప్పడంతో తడిచెత్త, పొడిచెత్తలు వేయడానికి రెండు, మూడు రోజుల్లో ఇంటికి 2 బుట్టల చొప్పున 16 వేల బుట్టలను ఇంటింటికీ తిరిగి అందజేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆదేశించారు.
వార్డు ప్రత్యేక అధికారులు ఇంటింటికీ తిరిగి బుట్టలను అందజేయాలని ఆదేశించారు. వచ్చే నాలుగేళ్ల వరకు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేవని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన పని అని మంత్రి చెప్పారు. తాము హైదరాబాద్ నుండి వచ్చినంత మాత్రాన ఒక్క రోజుల చూ మంత్రం అనగానే సమస్యలు తొలగిపోవని ప్రజలు చైతన్యవంతులై తమ ఇళ్లను ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా వీధులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని సూచించారు. తాను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల మున్సిపాల్టీలో పొడి చెత్త ద్వారా వ్యాపారం చేసి నెలకు 3 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారని చెప్పారు. అలాగే దేవరకొండ మున్సిపాల్టీలో నెలకు లక్ష రూపాయలకు తగ్గకుండా ఆదాయం పొందవచ్చని చెప్పారు. ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం మున్సిపల్ వాహనం వెళ్ళాలని లేనట్టయితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ ఇంట్లో కూర్చుంటే కుదరదని ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు రోడ్లపై పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
మీ వార్డులోనే ఇంత చెత్తా?
నేడు పర్యటించే వార్డుల్లోనే ఇంత చెత్త ఉంది.. ఇంక వేరే వార్డుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ఇళ్ల మధ్య చెత్త ఉన్నందుకు స్థల యజమానికి జరిమానా విధించాలా? లేక నీకు జరిమానా విధించాలా? అని మంత్రి కేటీఆర్.. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే జరిమానా విధించాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు. పట్టణంలోని పారిశుద్ధ్య పరిస్థితిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో మున్సిపాల్టీ పని తీరులో మార్పు కనిపిస్తేనే నిధులు మంజూరు చేస్తానని అప్పటి వరకు నిధులు మంజూరు చేయనని కేటీఆర్ స్పషటం చేశారు.
దేవరకొండ మున్సిపాల్టీ పరిధిలోని వక్ఫ్ భూమిలో తెలిసోతెలియకో తాము ఇళ్ల్లు నిర్మించుకున్నామని వాటికి చట్టబద్దత లేక తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు విన్నవించడంతో స్పందించిన మంత్రి వక్ఫ్ స్థలంలో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎంత స్థలంలో నిర్మాణంలో ఉన్నాయన్న విషయాలను వెంటనే విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆదేశించారు.
అవసరమైతే ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములకు వక్ఫ్ బోర్డుకు డబ్బులు చెల్లించి పేదలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
*చిత్రాలు.. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో మహిళలు ఇచ్చిన మిషన్ భగీరథ నీటిని తాగుతున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
* 50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి