తెలంగాణ

మార్పులకు అనుగుణంగా మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కాలేజీల యాజమాన్యాలు తమ సాంకేతిక విద్యాసంస్థలను నవీకరించుకోవాలని, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి ఉపాధికి సన్నద్ధంగా తయారుచేయాలని జేఎన్‌టీయూహెచ్ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ జయేష్ రంజన్ పేర్కొన్నారు. మంగళవారం వర్సిటీలో సాంకేతిక విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి 200కు పైగా కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏ గోవర్థన్, యుఏఏసీ డైరెక్టర్ డాక్టర్ రామమోహన్‌రెడ్డి, డీఏపీ డైరెక్టర్ డాక్టర్ బీఎన్ భండారి తదితరులు ఈ విద్యాసంవత్సరం నుండి తీసుకొస్తున్న మార్పులు. చేర్పుల గురించి వారికి వివరించారు. ప్రధానంగా జేహెచ్ కార్యకలాపాలు, కేంద్రీకృత ప్రాంగణ నియామకాలు, పరీక్షల సంస్కరణలు, అడ్మిషన్ల విధానంపై విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్‌కు వివరాలు అందించారు. దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో వస్తున్న కొత్త కోర్సులకు అనుగుణంగా కాలేజీలు సిద్ధం కావాలని, అదే విధంగా బోధన సిబ్బందికి సైతం కొత్త కోర్సులపై అవగాహన, శిక్షణ ఇవ్వాలని, నిరంతర పున:శ్చరణ తరగతులు నిర్వహించి బోధనాభ్యసన పద్ధతుల్లో వస్తున్న మార్పులపై పట్టు కల్పించాలని అన్నారు. గత ఏడాదికీ, వచ్చే ఏడాదికీ అనుబంధ గుర్తింపులో తీసుకొచ్చిన మార్పులను డాక్టర్ రామమోహన్‌రెడ్డి వారికి వివరించారు. స్వయం ప్రతిపత్తి కాలేజీలు కొత్త కోర్సులను ప్రారంభించిన పక్షంలో అందుకు అనుగుణంగా బోధన సిబ్బందిని పెంచుకోవాలని అన్నారు. మంచి ఫలితాలను అన్ని కాలేజీలు సాధించినపుడే దేశవ్యాప్తంగా మిగిలిన యూనివర్సిటీలతో పోటీ పడి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో మంచి ర్యాంకు సాధింగలుగుతామని, యూనివర్సిటీ ప్రతిష్ట ఇనుమడిస్తుందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల విధానం, అనుమానాలను ఇవాల్యూయేషన్ డైరెక్టర్ డాక్టర్ వీ కామాక్షి ప్రసాద్ నివృత్తి చేశారు. జేహబ్ గురించి డైరెక్టర్ డాక్టర్ జీ విజయకుమారి వివరించగా, డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ ఎం మన్జూర్ హుస్సేన్ సెట్స్ అనంతరం జరిగే అడ్మిషన్ల ప్రక్రియను వివరించారు. అనంతరం సీహెచ్ వెంకటరమణారెడ్డి, జీ ప్రవీణ్ బాబు, డాక్టర్ కే విజయకుమార్ తదితరులు యాజమాన్యాల అనుమానాలను తీర్చారు.
*చిత్రం...ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న జయేష్‌రంజన్