తెలంగాణ

డీసీసీబీ, డీసీఎంఎస్‌లు గులాబీమయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల (డీసీఎంఎస్) పాలక వర్గాలన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. మంగళవారం డీసీసీబీ, డీసీఎంఎస్‌ల డైరెక్టర్ల పోస్టులకు నామినేషన్ల పర్వం కొనసాగింది. చాలా వరకు ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగాయి. చాలా జిల్లాల్లో ఎస్‌సీ, ఎస్‌టీలకు కేటాయించిన డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) అధ్యక్షస్థానాలకు రిజర్వేషన్ విధానం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఎస్‌సీ, ఎస్‌టీలు చాలా జిల్లాల్లో ఎన్నిక కాలేదు. డీసీసీబీలతో పాటు డీసీఎంఎస్‌లకు నామినేషన్లు వేయడం, పరిశీలన, ఉపసంహరణ అన్నీ మంగళవారమే జరిగాయి. డీసీసీబీకి 20 మందిని, డీసీఎంఎస్‌కి 10 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకోవాల్సి ఉంది. సాయంత్రం ఐదుగంటల తర్వాత నామినేన్ల ఉపసంహరణ తర్వాత మెజారిటీ స్థానాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఏకగ్రీవమైనట్టు తేలింది. వాస్తవంగా డైరెక్టర్ల పోస్టులకు మంగళవారం నామినేషన్ల పర్వం పూర్తి చేసి, ఈ నెల 28 న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోటీ లేకపోవడం వల్ల 28 న ఎన్నికల కార్యక్రమం నామ్‌కేవాస్తేగా ఉంటుంది. ఈ నెల 29 న డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. డీసీసీబీలకు ఎన్నికయ్యే 20 మంది డైరెక్టర్లలో ఒకరు అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంది. అలాగే డీసీఎంఎస్‌లకు కూడా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల్లోనూ సంబంధిత జిల్లాల మంత్రులు స్వయంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ల డైరెక్టర్ల ఎన్నికలను మంగళవారం పర్యవేక్షించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడటంలో చాలా వరకు కృతకృత్యులయ్యారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల కోసం అంతా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపికలో తుది నిర్ణయం కేటీఆర్‌దేనని తెలుస్తోంది. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుని కేటీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎవరికి వారు తమ అనుచరులకు పట్టం కట్టించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.