తెలంగాణ

ఆషామాషీగా తీసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: రాష్ట్ర ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్ట ణ ప్రగతి కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకొవద్దని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల స్వరూపాలను మార్చేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ముందుకు తీసుకువచ్చారని ఆయ న అన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పట్టణాల్లో పట్టణ ప్రగతిలో భాగంగా ప్రణాళికలన్నీ పది రోజుల్లోపు రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో పట్టణ ప్రగతిపై నిర్వహించిన సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్వకుర్తి వేదికగా ఓ విషయాన్ని తెలియజేస్తున్నానని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో మహిళా కౌన్సిలర్లు ఉన్నారని అయితే మహిళా కౌన్సిలర్లుగా ఉన్నవారు తమ బాధ్యతలను తెలుసుకోవడం లేదని, ముఖ్యంగా
నూతనంగా తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంపై అవగాహన ఉండాలని పిలుపునిచ్చారు. భార్య మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉంటే భర్త పెత్తనం చేయొద్దని, అలాంటి వ్యవస్థ తెలంగాణలో ఉండకూడదన్నారు. అందుకే తాను స్పష్టంగా వెల్లడిస్తున్నానని ఎవరి బాధ్యతలు వారే నిర్వర్తించాలని, లేనిపక్షంలో జరిగే ఇబ్బందులకు వారే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు కూడా చురుకుగా పాల్గొని తమ వార్డులను అభివృద్ధి పర్చుకోవాలని పిలుపునిచ్చారు. కాదు.. కుదరదు అంటే పదవులు పోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ముగిశాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాల్లో నెలకొన్న సమస్యలను పారదోలేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో దోమలు, ఈగలు లేని పట్టణాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజల కోసమే పనిచేయడం తమ పని అని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే చాలు అనుకుంటారని అదికాదని ఇంటితో పాటు తన పరిసరాలు, వీధులు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచన ప్రతి వ్యక్తిలో రావాలని కోరారు. ఇక పాతపద్ధతులు అన్నీ మరచిపోయి కొత్తపద్ధతులు అలవాటు చేసుకుని కల్వకుర్తి పట్టణాన్ని పచ్చని పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత వార్డు కమిటీ సభ్యులపై ఉందన్నారు. పచ్చదనానికి 10 శాతం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు తమ బడ్జెట్‌లో కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. నాటిన మొక్కలలో 85 శాతం బతికించుకుని చెట్లుగా పెంచాలని అప్పుడే ఆ వార్డు కౌన్సిలర్ పనిచేసినట్టుగా గుర్తింపు లభిస్తుందన్నారు. లేకపోతే పదవి ఎగిరిపోవడం తథ్యమని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ లే అవుట్లను గుర్తించి వాటి వివరాలను సేకరించి మున్సిపల్ అనుమతితో లే అవుట్లను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. నల్లమల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కల్వకుర్తి పట్టణంలో పచ్చదనం ఆశించిన స్థాయిలో లేదని, నల్లమలను ఆదర్శంగా తీసుకుని కల్వకుర్తి పట్టణంలో కూడా ప్రతివార్డులో చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. ఇందులో పట్టణ ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎంపీ రాములు, మున్సిపల్ అడ్మినిస్టేషన్ రాష్ట్ర అధికారి సత్యనారాయణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మంద జగన్నాథం, కలెక్టర్ శ్రీ్ధర్, జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన పట్టణ ప్రగతి సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్