తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో చాన్స్ ఎవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాలకు అవకాశం ఎవరికి దక్కుతుందనేది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావు పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ముగియనుంది. ఆలోగా జరుగబోయే రాజ్యసభ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి షెడ్యూల్ విడుదల చేశారు. కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ నుంచి, గరికపాటి మోహన్‌రావు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా గరికపాటి మోహన్‌రావు బీజేపీలో చేరగా, కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. వాస్తవానికి కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికైన రాజ్యసభ సభ్యులను రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. ఇందులో రాజ్యసభ సభ్యులు కే కేశవరావు(టీఆర్‌ఎస్), టీ సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్), తోట సీతారామలక్ష్మి (టీడీపీ)లను ఆంధ్రప్రదేశ్‌కు, కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి మోహన్‌రావు (టీడీపీ)లను తెలంగాణకు కేటాయించారు. ప్రస్తుతం ఈ ఐదుగురి పదవీకాలం రానున్న ఏప్రిల్ 9న ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇలాఉండగా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా, పార్టీ సెక్రటరీ జనరల్‌గా కేశవరావు కొనసాగుతుండడంతో మళ్లీ ఆయనకే అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాల అంచనా. అయితే, ఖాళీ అయ్యే రెండో స్థానానికి టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి ప్రధానంగా రేసులో ఉన్నారు. వీరే కాకుండా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రాజ్యసభ సీటు ఆశించినప్పటికీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులపై కొల్లాపూర్, అయిజ పట్టణాల్లో ఆయన తిరుగుబాటు అభ్యర్థులను బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా జూపల్లి కృష్ణారావు అభ్యర్థిత్వం పరిశీలనకు వచ్చే అవకాశం లేదని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవి ఇవ్వనున్నట్టు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో భవిష్యత్‌లో గౌరవప్రదమైన పదవి ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఉన్నతమైన పదవి ఇవ్వనున్నట్టు కూడా హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ ముగ్గురితో పాటు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల సమాచారం. రాజ్యసభ ఖాళీ స్థానాలకు మార్చి 6 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానుండడంతో మొదటి వారానికల్లా అవకాశం ఎవరికి దక్కేది తేలవచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.