తెలంగాణ

పోలీసుల పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రత పరిరక్షణలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహిరిస్తున్నామని, తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫాలితాలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి, పోలీస్ శాఖకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశ్యంతో కట్టుకథలు అల్లి పోలీస్ శాఖ నైతిక స్థైర్యం దెబ్బ తీయాలని కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో కామాండ్ కంట్రోల్ భవనంను అన్ని హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పోలీసు శాఖకు పూర్తి స్వేచ్చనిచ్చిందని, ఏలాంటి రాజకీయ జోక్యం లేదని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు.

*చిత్రం...మీడియా సమావేశంలో మాట్లాడుతున్న హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ