తెలంగాణ

ఎవరికీ పట్టని మాతృభాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఆంగ్లమోజులో పాఠశాలల్లో నెమ్మదిగా తెలుగు భాషా బోధన తగ్గిపోవడంతో రానున్న రోజుల్లో తెలుగుభాష సైతం మృత భాషల జాబితాలో చేరిపోతుందా అని భాషా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎప్పటికీ తెలుగు భాష మృత భాషల జాబితాలో చేరే ముప్పులేకపోయినా, ప్రస్తుత ప్రభుత్వాల తీరుతెన్నులు చూస్తుంటే ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 29న గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మరో పక్క ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషాదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఆయా స్థానిక భాషలను ప్రోత్సహించేందుకు , అభివృద్ధికీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాష ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా మాట్లాడుతుండగా, యానాం, ఒరిస్సా, కర్నాటక, తమిళనాడు, కేరళ, చత్తీస్‌ఘడ్, జార్ఖాండ్, మహారాష్ట్రాల్లో సైతం భారీ సంఖ్యలోనే తెలుగు మాట్లాడేవారున్నారు. ఇక అమెరికా, బ్రిటన్, మాల్దీవులు, మలేషియా, సింగపూర్ సహా మరో డజనుకు పైగా దేశాల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య భారీగానే ఉంటోంది. తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుని తెలుగు మాట్లాడేవారి సంఖ్యను, రాసేవారి సంఖ్యను పెంచేందుకు అనేక వ్యూహాలను రచిస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ అలికిడి ఉండటం లేదు. ఏదో ఒకటి రెండు సంస్థలు మాత్రం భాషాభిమానంతో కార్యక్రమాలు నిర్వహించడం వినా ఎవరికీ పట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ప్రాధమిక విద్యను ఆంగ్లభాషలోకి మారుస్తుండగా, తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ ఆంగ్లభాషా మాద్యమంలోనే కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, జనరల్ గురుకులాలతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు సైతం ఆంగ్లభాషామాద్యమంలోనే కొనసాగుతున్నాయి. లెక్కకు కొద్దిగా ప్రభుత్వ పాఠశాలలు, హైస్కూళ్లలో మాత్రమే తెలుగు మాద్యమం కొనసాగుతోంది. కొన్ని పాఠశాలల్లో సమాంతరంగా ఆంగ్లమాద్యమం క్లాసులు కొనసాగుతున్నాయి. 10వేల సంవత్సరాల నుండి తెలుగుభాష ఉనికి ఉన్నా, రెండు మూడు వేల సంవత్సరాల నుండి తెలుగు భాషా సాహిత్య ఆనవాళ్లున్నా రెండు రాష్ట్రాల్లొ నేటికీ అధికార భాషా సంఘాలు నామ్‌కేవాస్తే అన్నట్టు పనిచేస్తున్నాయి. ఆంధ్రాలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలంగాణలో దేవులపల్లి ప్రభాకరరావు అధికార భాషా సంఘాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. గ్రామ సచివాలయం మొదలు రాష్ట్ర సచివాలయం వరకూ అన్ని స్థాయిల్లో సమాచార మార్పిడి తెలుగులోనే జరగాలని, న్యాయస్థానాల్లో తీర్పులు తెలుగులోనే జరగాలని, ఊళ్లలో హోటళ్లు, ఇతర సంస్థల నామ ఫలకాలు తెలుగులోనే ఉండాలని మహోన్నత ఆశయాలను పెట్టుకున్నా అవి నేటికీ నెరవేరలేదు. మరో పక్క అధికార భాషా సంఘాలకు కోరలు లేకపోవడంతో ఎవరి మీద ఎలాంటి చర్యలకూ అవకాశం లేకుండాపోయింది. తెలుగు భాషకు విశిష్ట భాష హోదా లభించినా దానిని కూడా సవ్యంగా అమలు చేయాలేకపోయారు. ఐదేళ్ల వ్యవధిలో వంద కోట్లు వరకూ భాషాభివృద్ధికి వెచ్చించే అవకాశం ఉన్నా రాష్ట్రాలు తమ వాటాను కేటాయించకపోవడం, కేంద్రం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లకపోవడంతో భాషాభివృద్ధి నిధులు దాదాపు రెండు వందల కోట్ల మేర నష్టపోవల్సి వచ్చింది.