తెలంగాణ

హాకర్స్‌కు లైసెన్స్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: వీధుల్లో చిరు వ్యాపారాలు (స్ట్రీట్ వెండర్స్) నిర్వహించుకునే వారి జీవనోపాధికి భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వపరంగా గుర్తింపు కార్డులు జారీ చేయడానికి విధివిధానాలను ఖరారు చేస్తూ మంగళవారం మున్సిపల్ పాలనా, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి కోసం ఇదివరకే కేంద్రం చేసిన చట్టం-2014ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీధి వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడానికి సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వీరి నివాస ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు వీటిలో ఏదో కలిగి ఉన్న సర్వే జరిపేవారు నమోదు చేసుకుంటారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. పై ధ్రువీకరణ పత్రాలు లేనిపక్షంలో వారి నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. గుర్తింపు కార్డుతో పాటు వ్యాపార లైసెన్స్ పొందడానికి మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో రూ.150, మిషన్ సిటీస్‌లో రూ. 200, అర్బన్ డవలప్‌మెంట్ సంస్థల పరిధిలో రూ.100 వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. వీరికి జారీ చేసే గుర్తింపుకార్డులు, లైసెన్స్‌లను ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.