తెలంగాణ

మళ్లీ స్వైన్ సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఫిబ్రవరి 20: స్వైన్‌ఫ్లూ పని అయిపోయిందని భావిస్తున్న సమయంలో మళ్లీ కలకలం రేగింది. ఒకవైపు ప్రపంచాన్ని కోవిడ్-19 గడగడలాడిస్తుంటే, మహానగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ సైరన్ మోగింది. స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో మొత్తం ఏడుగురు గాంధీ ఆసుపత్రిలో చేరగా, అందులో వ్యాధి నిర్దారణ అయిన ఇద్దరిలో ఒకరికి వ్యాధి నయం కావటంతో గురువారం డిశ్చార్జ్ చేయగా, కరీంనగర్ నుంచి వచ్చిన ఓ గర్భిణిని ఐసొలేటెడ్ వార్డులో ఉంచి గాంధీ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న గర్భిణి బుధవారం మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు కూడా స్వైన్‌ఫ్లూ ఏమైనా సోకిందా? అన్న కోణంలో వైద్యులు పరీక్షలు చేస్తుండగా, తల్లి పరిస్థితి కొంత సీరియస్‌గానే ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఇప్పటికే కోవిడ్-19 అనుమానిత లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆసుప్రతికి వచ్చిన రోగుల సంఖ్య 72కు పెరిగింది. వీరిలో 70 మంది రోగులకు సంబంధించి కోవిడ్ వ్యాధి లేనట్టు రిపోర్టులు రాగా, మరో ఇద్దరి వైద్యపరీక్షల రిపోర్టులు రావల్సి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాంధీ ఆసుపత్రికి ప్రతిరోజు నాలుగు వేల పై చిలుకు రోగులు వివిధ రకాల వైద్యం కోసం వస్తుండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వేలకు తగ్గిందని ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా. రాజారావు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్వైన్‌ఫ్లూ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో మొత్తం 54మంది మంది స్వైన్ ఫ్లూ నిర్దారణ అయి, చికిత్స పొందగా, అందులో 12మంది మృతి చెందారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం 13మందికి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్దారణ అయి, వారు చికిత్స పొందటంతో వ్యాధి నయమై డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలిపారు. కోవిడ్-19 వైరస్ ప్రభావం తెలంగాణలో ఇప్పటి వరకు నమోదు కాలేదని తెలిపారు. కోవిడ్-19 అనుమానితుల చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. వారి కోసం ప్రత్యేక లిఫ్ట్‌ను, ప్రత్యేక వైద్యుల, సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు బయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

*చిత్రం... స్వైన్‌ఫ్లూ, కోవిడ్ అనుమానిత లక్షాలున్న రోగుల వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు