తెలంగాణ

పది రోజుల్లో స్వరూపం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 20: పల్లెప్రగతి స్ఫూర్తితో ఈ నెల 24వ తేదీ నుంచి పదిరోజుల పాటు చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల స్వరూపం మారిపోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో 8వేల పంచాయతీలుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ 12వేలు చేశారని, పల్లెప్రగతితో గ్రామాలన్నీ బాగుపడ్డాయన్నారు. అదే విధంగా మున్సిపాల్టీల సంఖ్యను కూడా భారీగా పెంచారని, పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఆ ప్రాంత ప్రజల సమస్యలు తీరిపోవాలన్నారు. వచ్చే 8నెలల్లో కరెంటుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కావాలని, లేనిపక్షంలో సంబంధిత చైర్మన్లు, కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి వార్డులోని సమస్యలను తెలుసుకునేందుకు 60 మందితో నాలుగు కమిటీలను వేయాలని, పట్టణ ప్రగతి కార్యక్రమంలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పల్లెల్లో సర్పంచ్‌ల మాదిరిగానే పట్టణాల్లో చెట్లు పెంచే బాధ్యత కౌన్సిలర్లదేనన్నారు. ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారి ఉంటారని, కౌన్సిలర్‌తో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తారన్నారు. ప్రతి మున్సిపాల్టీలో చెత్త సేకరణకు అవసరమయినన్ని వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పట్టణాలకు అవసరమైన మొక్కల కోసం నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని, వైకుంఠధామం, డంపింగ్‌యార్డులు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
మూడునెలల్లోనే అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ఈ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
*చిత్రం... మాట్లాడుతున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్