తెలంగాణ

రెండు, మూడు వారాల్లో.. వీసీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియ పూర్వరంగంలో ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు సత్వరంగా పూర్తి చేయాలని కూడా సీఎం ఆదేశించారు. దీనివల్ల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని సీఎం సూచించారు. వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను రెండు, మూడు వారాల్లో పూర్తి చేయాల్సిందిగా కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాఉండగా రాష్టవ్య్రాప్తంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్), కాకతీయ విశ్వవిద్యాలయం (వరంగ ల్), పాలమూరు విశ్వవిద్యాలయం (మహబూబ్‌నగర్), శాతవాహన విశ్వవిద్యాలయం (కరీంనగ ర్), తెలంగాణ విశ్వవిద్యాలయం (నిజామాబా ద్), మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (నల్లగొండ), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం (హైదరాబాద్), జవహర్‌లాల్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం (హైదరాబాద్) ఉన్నాయి. వీటికి వైస్ చాన్సలర్ల పదవీ కాలం ముగియడంతో ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జీలుగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే వైస్ చాన్సలర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ కాగా ఉస్మానియాకు 114, కాకతీయకు 110, పాలమూరుకు 122, శాతవాహనకు 125, మహాత్మాగాంధీకి 124, అంబేద్కర్‌కు 142, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి 56 దరఖాస్తులు అం దాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో 54 మంది బహుళ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తులు చేసుకున్నట్టు సమాచారం. వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియ ప్రారంభించాలని
సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మొదట ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు కానుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై యూనివర్సిటీ నామినీ పేరును సిఫారసు చేస్తా యి. ప్రభుత్వ నామినీ, యూజీసీ నామినీలతో కూడిన సెర్చ్ కమిటీలు వీసీల ఎంపికపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనుంది.
శ్రీరామ్‌సాగర్ నుంచి ఎల్లంపల్లి..
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాన్ని ఉపయోగించుకొని ఎల్లంపల్లి నుంచి వరద కాలువకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వరద కాలువకు నీరు అందించడానికి అవసరమైన నిల్వలు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో లేని కారణంగా ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వరద కాలువకు శ్రీరామ్‌సాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా నిర్మించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మీపురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా వరద కాలువలోకి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. దీని వల్ల బాల్కొండ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆయకట్టుకు రబీకి నీరు అందివ్వాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు