తెలంగాణ

ఫార్మా రంగానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: బయో ఆసియా మూడురోజుల సదస్సుతో హైదరాబాద్ మురిసిపోయింది. సోమవారం ప్రారంభమైన బయో ఆసియా 2020 సదస్సు బుధవారం ముగిసింది. ఫార్మారంగానికి మరీ ముఖ్యంగా జీవశాస్త్ర రంగం అభివృద్ధి చెందేందుకు ఈ సదస్సు ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడు రోజు సదస్సులో భాగంగా రెండువేల భాగస్వామ్య సమావేశాలు నిర్వహించారు. 37 దేశాలకు చెందిన 2,100 ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో 100 మందికి పైగా హైప్రొఫైల్ స్పీకర్లు, 800 కార్పోరేట్లు మాట్లాడారు. మెడికల్ డివైజ్ పార్క్ మరియు జీనోమ్ వ్యాలీలో కొత్త యూనిట్లు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన ఐదు కంపెనీలకు భూముల కేటాయింపు లేఖలు తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అందించారు. భూకేటాయింపులు పొందిన కంపెనీల్లో జాగోర్ లైఫ్ సైనె్సస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాజిక్ మెడికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ని మెడికా ప్రైవేట్ లిమిటెడ్, ట్రైడెంట్ టెక్నాలజీస్, పల్స్ ఫార్మాక్యూటికల్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు మెడ్ టెక్ పార్క్‌లో తమ యూనిట్లను నెకొల్పేందుకు అంగీకరించాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐదు స్టార్టప్ కంపెనీలకు మంత్రి కేటీఆర్ అవార్డులను అందించారు. అవార్డుల కోసం 350 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా, వీటిలో 75 కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటి నుండి ఉత్తమమైనవిగా ఐదు కంపెనీలను ఎంపిక చేశారు. ఈ కంపెనీలకు నగదు బహుమతులతో పాటు అవార్డులను అందించారు. ఇంటెల్ సంస్థ ‘ఇంటెల్ అల్ అప్లైడ్ రీసర్చ్ సెంటర్’ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. వేదికపైనుండి ఈ సెంటర్‌ను కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. బయో ఆసియా సదస్సు ముగింపు సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ సదస్సు విజయవంతంగా కొనసాగిందని కితాబిచ్చారు. 2020 సదస్సు కన్నా 2021 బయోఆసియా సదస్సు మరింత భారీ ఎత్తున జరగాలని కోరుతున్నానని అన్నారు. ఫార్మా రంగంలో మహిళలు చురుకుగా పాల్గొంటున్నారని పరిమళ్ ఎంటర్‌ప్రైజెస్ వైస్-చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతి పరిమళ్ పేర్కొన్నారు. 10 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె కోరారు.
ఒడిషా రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అశోక్ చంద్ర పండా, తెలంగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
*చిత్రం... హైదరాబాద్‌లో బుధవారం బయో ఆసియా ముగింపు సదస్సులో పాల్గొన్న కేటీఆర్