తెలంగాణ

రూ. 11 కోట్లకు చేరువలో మేడారం హుండీల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 19: గత మేడారం జాతర హుండీ ఆదాయం బ్రేక్ అయ్యంది. గత ఏడాది మేడారం జాతర ద్వారా హుండీల ఆదాయం దాదాపు పది కోట్ల పైచిలుకు రాగా ఇప్పటికే 11 కోట్ల చేరువకు చేరింది. బుధవారం 56 హుండీలను లెక్కించగా 59 లక్షల 22 వేలు వచ్చింది. మొత్తం 494 హుండీలకు గాను 492 హుండీలను లెక్కించారు. ఇంకా రెండు హుండీలతో పాటు భారీ ఎత్తున బంగారు అభరణాలు, విదేశీ కరెన్సీ లెక్కించాల్సి ఉంది. హుండీలలో నోట్లతో పాటు వీదేశీ కరెన్సీ, బంగారం, వెండి అభరణాలు పెద్ద ఎత్తున దర్శనం ఇస్తున్నాయి. హుండీల నుండి కుప్పలు తెప్పలుగా పడుతున్న కానుకలను చూసి సిబ్బంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీటితో పాటు వీదేశీ కరెన్సీ కాకుండా రద్దయన పాత నోట్లు, వెండి కడియాలు, బంగారు కడియాలు, కుంకమ భరణిలు, వివిధ ప్రతిమలు బయటపడుతున్నాయి. ఈ నెల 12 మొదలైన హుండీల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో రెండు మూడు రోజుల్లో మేడారం జాతర హుండీల ఆదాయం లెక్క తేలే అవకాశాలు ఉన్నాయి.

*చిత్రం... మేడారం హుండీలను లెక్కిస్తున్న సిబ్బంది