తెలంగాణ

రాజకీయాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికీ అందిస్తోందని రాష్ట్ర గిరిజన, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మానుకోట జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారన్నారు. పల్లెప్రగతిలో మహబూబాబాద్ జిల్లా ప్రస్తుతం 11వ స్థానంలో ఉందని ఇది విచారకరమన్నారు.
11వ స్థానంలో ఉన్న మానుకోటను పట్టుదలతో పని చేసి ఈ విడతలో మొదటి స్థానంలోకి తీసుకురావాలని ఆమె కోరారు. కేవలం ఫొటోల కోసం కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ప్రగతి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈనెల 25వ తేదీ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు పల్లెనిద్రలు చేస్తున్నారని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇతర ప్రజాప్రతినిధులు కూడా పల్లెనిద్ర చేసి గ్రామ ప్రజలకు ప్రగతి పట్ల, ప్రభుత్వ పనితీరు పట్ల విశ్వాసాన్ని కల్పించాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఈ ప్రణాళికకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న సర్పంచులు అదృష్టవంతులని, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు చేరడంతో వారిపైన సగానికి పైగా భారం తగ్గిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు అన్ని చెరువులు అలుగులు పోస్తున్నాయని, దీంతో సాగునీటి కష్టాలు కూడా తీరిపోయాయన్నారు. ప్రతి గ్రామంలోను విద్యుత్‌ను ఆధునీకరించాలని, త్రీ ఫేజ్ లేక ఇబ్బందిపడే పరిస్థితి ఉండవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారని, దీంతో పల్లెలకు కరెంటు కష్టాలు కూడా తీరిపోయాయని సత్యవతి అన్నారు. ప్రతి గ్రామంలోనూ నర్సరీల ఏర్పాటు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు వంటి కార్యక్రమాలు పల్లె ప్రగతిలో భాగంగా చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. అంతేకాక గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఇన్ని రకాల అవకాశాలు గతంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధికి లభించలేదన్నారు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సర్పంచులు చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన అందించాలని, ప్రతి గ్రామం గంగదేవిపల్లిలా అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని సత్యవతి రాథోడ్ తెలిపారు. అనంతరం 150 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌కు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మొక్కను అందజేశారు. ఇతర ప్రజాప్రతినిధులకు జిల్లా యంత్రాంగం తరఫున మొక్కలను బొకేలుగా అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్‌తో పాటు మానుకోట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, భానోతు శంకర్‌నాయక్, హరిప్రియ, సీతక్క, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు, జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు..
*చిత్రాలు.. మానుకోట జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పంచాయతీ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
* ట్రాక్టర్ నడుపుతున్న మంత్రి