తెలంగాణ

పల్లె ప్రగతికి సిద్ధంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఫిబ్రవరి 19: పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణకు అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్‌లోని సాగర్ కనె్వన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈనెల 23 నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణ, విధులపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు కర్తవ్య బోధ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందేలా సమష్ట్టిగా పనిచేయాలని సూచించారు. స్వచ్ఛ, పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం రూపొందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నిధులు, విధులు కేటాయించిందని వెల్లడించారు. పల్లెలకు అవసరమైన సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రాక్టర్‌ల కొనుగోలు పూర్తి చేయాలని, వైకుంఠధామాలు తప్పనిసరిగా నిర్మించాలని ఆదేశించారు. వర్షాకాలం నాటికి హరితహారం మొక్కలు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

*చిత్రాలు.. నిర్మల్‌లో బుధవారం నిర్వహించిన పంచాయతీ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
* హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు