తెలంగాణ

పూలే విగ్రహం ఏర్పాటు యోచన భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు స్వాగతించారు. ఇది ఒక మంచి ఆలోచన అని ఆయన అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావుఫూలే మహాశయుడి విగ్రహం పెట్టేందుకు అనువైన స్థలం ఉందన్నారు. మహాత్మాజ్యోతిరావు ఫూలే ఆడిటోరియం కట్టాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఆడిటోరియంను నిర్మించేందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. బతుకమ్మ కుంటను కాపాడాలని,అవసరమైతే ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానని ఆయన చెప్పారు.
బిల్డర్స్‌కు అనుకూలంగా కేసీఆర్
సర్కార్: హుడా మాజీ చైర్మన్ కోదండరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో భవనాల నిర్మాణం సజావుగా సాగేందుకు, అక్రమ నిర్మాణాలను నిరోధించేందుకు రెగ్యులేటరీ అథారిటీ చట్టాన్ని ఏర్పాటు చేయాలని హుడా మాజీ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇష్టానుసారంగా భవనాల నిర్మాణం సాగుతోందన్నారు. ఎన్టీఏ ప్రభుత్వ హయాంలో వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం వచ్చిందన్నారు. రేరా చట్టం కొనుగోలుదారులకు రక్షణగా నిలిచిందన్నారు. 2016లో రెగ్యులేటరీ అథారిటీ చట్టం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అథారిటీ ఏర్పాటైందన్నారు. అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని గొప్పగా మాట్లాడే కేటీఆర్‌కు సంబంధించిన శాఖకు రెగ్యులేటరీ అథారిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అథారిటీని ఏర్పాటు చేశారన్నారు. బిల్డర్స్‌కు అన్ని విధాలుగా సహాయం చేస్తున్న కేటీఆర్ కొనుగోలు దారుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యతను సొమ్ము చేసుకుంటున్నారే తప్ప ఇక్కడ ఇల్లు కట్టుకునే మధ్యతరగతి, పేద ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తమకు కావాల్సిన సంస్థలకు వందల ఎకరాల భూమిని రాష్ట్రప్రభుత్వం కేటాయించిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చట్టసభల్లో మాట్లాడిన మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. ప్రభుత్వం బిల్డర్ల ప్రయోజనాలకు పాటుపడుతోందని, సామన్య ప్రజల ఇక్కట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.