తెలంగాణ

పీఆర్‌సీపై ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ)పై కమిటీకి అప్పగించిన పని పూర్తి కాకపోవడం వల్లనే గడువు పొడిగించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. పీఆర్‌సీ కమిషన్ గడువును డిసెంబర్ వరకు పొడిగించడం పట్ల ఆందోళనకు గురైన ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు బుధవారం సచివాలయంలో సీఎస్ సోమేశ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. పీఆర్‌సీ గడువు పొడిగించడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, ఈ గడువు పొడిగింపు విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని సీఎస్ వారి భరోసా ఇచ్చారు. గడువు పొడిగించడానికి గల కారణాలను ఉద్యోగుల సంఘాల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్టి, సెక్రటరీ జనరల్ వీ మమత, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏ పద్మాచారి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి సీఎస్ వివరించారు. పీఆర్‌సీ కమిషన్ ఒక్క వేతన సవరణకు మాత్రమే పరిమితం కాదని, శాఖల మధ్య సమన్వయం, సర్వీసు రూల్స్ సవరణ, రాష్టప్రతి ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా, జోనల్, రాష్టస్థ్రాయి పోస్టుల స్థిరీకరణ, రాష్ట్ర విభజన సందర్భంగా వివిధ కార్యాలయాల్లో జరిగిన మార్పు లు, చేర్పులు తదితర అంశాలను అప్పగించినట్టు జేఏసీ నేతలకు ఆయన వివరించారు. అనేక అంశాలను సమన్వయం చేసుకుంటూ నివేదిక ఇవ్వాల్సి ఉండడంతో కమిటీ గడువును పొడిగించినట్టు ఆయన స్పష్టం చేశారు. అయితే తాము ఆందోళన చెందడానికి గల కారణాలను కూడా జేఏసీ నేతలు కారం రవీందర్‌రెడ్డి, మమత సీఎస్‌కు వివరించారు. పీఆర్‌సీ కమిషన్ గడువు పొడిగించడం వల్ల ఈ ఏడాది కూడా పీఆర్‌సీ రాదేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ గతంలో ఉద్యోగ సంఘాలను నేతలను పిలిపించుకొని పీఆర్‌సీని ప్రకటిస్తామని, అలాగే పదవీ విరమణ వయో పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చినట్టు వారు గుర్తు చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి పీఆర్‌సీని ఏర్పాటు చేసిందని సీఎస్ వివరించారు. దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ఈసారి గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌తో పాటు పీఆర్‌సీని మంజూరు చేయాలని సీఎస్‌ను కోరినట్టు జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి
మీడియాకు తెలిపారు.
సీఎస్ సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు ఎలాంటి ఆందోళన కానీ అభద్రతాభావానికి గానీ లోనుకావద్దని కారం రవీందర్‌రెడ్డి కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చనున్నట్టు సీఎస్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కాగా, అధికారుల నిర్లక్ష్యం వల్లనే పీఆర్‌సీ జాప్యానికి కారణమని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏ పద్మాచారి విమర్శించారు. కొత్త జిల్లాల పని భారాన్ని కూడా మోస్తున్నామని ఆయన చెప్పారు. పీఆర్‌సీ జీవోలో స్పష్టత లేకపోవడం వల్లనే ఉద్యోగుల ఆందోళనకు కారణమని పద్మాచారి తెలిపారు.

*చిత్రం...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధవారం భేటీ అయిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు