తెలంగాణ

ప్రగతిభవన్‌ను ముట్టడించే రోజొస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: నిరుద్యోగులను మోసం చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను నిలదీసేందుకు నిరుద్యోగులు ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు రోజులు దగ్గర్లోనే ఉన్నయని పీసీసీ మాజీ నేత వీ హనుమంతరావు అన్నారు. ఉస్మానియా వర్శిటీకి చెందిన విద్యార్థి నర్సయ్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నర్సయ్య కుటుంబానికి రూ.25లక్షలు ఆర్థిక సాయం చేయాలని ఆయన కేసీఆర్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. తన వంతు సాయంగా ఆయన నర్సయ్య తండ్రిని పరామర్శించి రూ.20వేలు ఇచరు. ఓయూ విద్యార్థి నర్సయ్య అంత్యక్రియల్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నర్సయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అన్ని విధానాల నర్సయ్య కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. నర్సయ్యది ప్రభుత్వ హత్య అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ను వెంటనే ఇవ్వాలని, నిరుద్యోగ భృతిని ప్రకటించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ దేశాభివృద్ధిని వెనక్కి నెట్టేందుకు వీలుగా బీజేపీ నిర్ణయాలు తీసుకుందన్నారు. దళిత, వాల్మీకులు మన దేశ ప్రజలు కాదని బీజేపీ నేతలు మాట్లాడారన్నారు. బీజేపీ న్యాయవాదుల వల్లనే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని పేరొక్న్నదన్నారు. కాంగ్రెస్ 70 సంవత్సరాల నుండి దేశంలో సమన్యాయం కోసం పనిచేస్తుందన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. పార్లమెంటు, రాజ్యసభలో ఈ బిల్లుపై మరోసారి చర్చ జరగాలన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. దేశంలో ఉద్యోగ కల్పన లేదని, పరిశ్రమలు రావడం లేదన్నారు. వీటిని పక్కదారి పట్టించేందుకు జాతీయ పౌర పట్టిక, జాతీయ రిజిస్టర్ పట్టిక, పౌరసత్వసవరణ చట్టాలను తెరపైకి బీజేపీ తెచ్చిందాన్నరు. ఎంఐఎం లాంటి పార్టీలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించి తన ఉనికిని చాటుకునేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందన్నారు. ఎంఐఎం పార్టీ మూసీనది లాంటిదన్నారు. సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే దమ్ము ఎంఐఎంకు ఉందా అన్నారు.
*చిత్రం... గాంధీభవన్‌లో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్