తెలంగాణ

రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి వౌలిక సదుపాయాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భువనగిరి రైల్వే స్టేషన్‌లో శాతావాహన, పద్మావతి, కోణార్క్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఇక్కడ ఆయన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. భువనగిరి జిల్లా కేంద్రమని, హైదరాబాద్ నగర శివార్లలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణమని ఆయన కేంద్ర మంత్రికి చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను భువనగిరిలో ఆపితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు ఉపయోగకరమన్నారు.
రామన్నపేట రైల్వే స్టేషన్‌లో చెన్నై ఎక్స్‌ప్రెస్, శబరి, కాకినాడ డెల్టా ప్యాసింజర్ రైళ్లను ఆపాలని ఎంపీ కోరారు. ఆలేరులో కోణార్క్, కాకినాడ-షిరిడీ, నాగావ ళి, నాందేడ్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, పద్మావతి రైళ్లను నిలపాలని కోరారు. జనగాంలో నాందేడ్, చార్మినార్, నర్సాపూర్, నాగర్‌సోల్, ఫలక్‌నుమా, భువనగిరి, విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలన్నారు. ప్రతి రైల్వే స్టేషన్లలో మెరుగైన వసతులను ఏర్పాటు చేయాలన్నారు. చిట్యాల, శ్రీరాంపురం రైల్వేస్టేషన్ల మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలన్నారు. పైవంతెన లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.