తెలంగాణ

మోదీ అనర్హుడు.. కేసీఆర్ గిరిజన వ్యతిరేకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే సామాజిక న్యాయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు హ క్కు కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల్లో నేడు ఆందోళన నెలకొంద ని, ఆయా వర్గాలకు భరోసా కల్పించేందుకే తాము ఈ ధర్నాను నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్ల తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు
నిరసనగా సోమవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ దళిత నేత దామోదర సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ నేటికీ కూడా రిజర్వేషన్లను కొనసాగించాలని బలంగా కోరుకుంటోందని అన్నారు. సామాజిక న్యాయాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్ రెండో పర్యాయం అధికారం చేపట్టినా, తన మంత్రివర్గంలో ఒక్క మాదిగ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి కూడా మంత్రి పదవి కేటాయించలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లపై నిజంగానే టీఆర్‌ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారైనా పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. గతంలో ఐఐటీ, ఐఐఎంలో రిజర్వేషన్లను కల్పించిన కాంగ్రెస్ చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లను కల్పించాలని కోరుతోందని వెల్లడించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ రిజర్వేషన్ల రద్దుకు నేడు కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ప్రమాదకరమైన కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దళిత, బడుగు, బలహీనవర్గాలను అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని, దేశంలోనే ఉంటూ మేమూ భారతీయులమేనని చెప్పుకోవాల్సిన దుస్థితి, హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని, ఇది దౌర్భాగ్యమని ఆయన వ్యాఖ్యానించారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషనే్ల ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎ కేసీఆర్ గిరిజన వ్యతిరేకి అని ముద్ర వేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్రమోదీ, కేసీఆర్ ఒక్కటేనని, అందుకే కేసీఆర్ రాష్టప్రతి ఎన్నిక, నోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్‌కు ఆమోదం తెలిపారని ఆయన ఆరోపించారు. మోదీ తన అనర్హతను కప్పిపుచ్చుకునేందుకే సరికొత్త చట్టాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆయన విమర్శించారు. నేడు టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేస్తున్నాయని, కానీ కాంగ్రెస్ తలుచుకుంటే ఆ పార్టీల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీకి పరోక్షంగా హెచ్చరించారు. కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ బిల్లుతో దేశంలోని ముస్లింలు జాతీయ జెండాను పట్టుకుని, మేమూ భారతీయులమేనని చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని, మైనారిటీల పట్ల మజ్లిస్‌కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బయటకు రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేస్తుందని అన్నారు. మాజీ మంత్రి డా.జే గీతారెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల వ్యవస్థతో ఎస్సీ, ఎస్టీలు నేడు అంటరానితనం నుంచి అందరితో కలిసి ఒక వేదికపై కూర్చునే స్థాయికి వచ్చారని, ఇది అంబేద్కర్ రాజ్యాంగ వల్లే సాధ్యమైందని, అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా నియమించింది కూడా కాంగ్రెసేనని గుర్తుచేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్రం రైల్వే, బీమా ఇతర ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని, అందుకే ఆయన రిజర్వేషన్లపై మాట్లాడరని విమర్శించారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ 70 ఏళ్లలో దేశాభివృద్ధికి రిజర్వేషన్లు ఎంతగానో దోహదపడ్డాయని, దళితుడ్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఎక్కువ శాతం దళిత, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకునే 4వేల ప్రాథమిక పాఠశాలలను రద్దు చేశారని, ప్రతిపక్షాలు కాంగ్రెస్‌తో కలిసి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే శ్రీ్ధర్‌బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, మాజీ ఎంపీ కొండా విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, కోదండరెడ్డి, సంపత్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... రిజర్వేషన్లపై సోమవారం ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో
మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి