తెలంగాణ

ఫార్మా హబ్ హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: భారత్ నుండి ఉత్పత్తి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్ నుండే 35 శాతం తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీ రామారావు తెలిపారు. సాంకేతికత, లైఫ్ సైనె్సస్ రంగాల్లో తెలంగాణ రాణిస్తోందని అన్నారు. ఆసియాలోనే హైదరాబాద్ ఫార్మా రంగానికి హబ్‌గా మారిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 800 ఫార్మా కంపెనీలు, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయని, ఇవి 50 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ప్రపంచానికే తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన బయో ఏసియా 17వ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ అవసరాన్ని కేంద్రం గుర్తించిందని, అందుకే అన్ని అనుమతులూ వచ్చాయని అన్నారు. బయో ఆసియా సదస్సు అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని ఆయన అన్నారు. 276 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కు ఏర్పాటైందని, రెండేళ్ల వ్యవధిలో 20 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు వౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన అన్నారు. ట్రిపుల్ ఐ - ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుకు 37 దేశాల నుండి సుమారు 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా సదస్సులో భాగంగా జీనోమ్ వ్యాలీని సందర్శించారు. అక్కడ పలువురు ప్రతినిధులతో కేటీఆర్ చర్చలు జరిపారు. సదస్సులో కేటీఆర్ జీనోమ్ వ్యాలీ అవార్డులను అందజేశారు. లైఫ్ సైనె్సస్ విభాగంలో విశేష కృషి చేసిన కార్ల్ హెచ్ జాన్‌కు, వాన్ నర్సింహన్‌కు ఈ అవార్డులు అందజేశారు. మంగళవారం నాడు సదస్సు రెండోరోజు భేటీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. సదస్సులో వివిధ దేశాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలనే పట్టుదల, కృతనిశ్చయంతో ఉన్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంతవరకూ నిర్వహించిన 16 సదస్సులో 17,500 కోట్ల రూపాయిలు పెట్టుబడులు వచ్చాయని, ఈసారి సదస్సులో మరింత ప్రయోజనాన్ని పొందేలా చూస్తామని ఆయన అన్నారు. డాక్టర్ కార్లహెచ్ జాన్, పీటర్ పియట్, రేణు స్వరూప్ వంటి హేమాహేమీలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
*చిత్రం... హైదరాబాద్‌లో సోమవారం జరిగిన బయో ఏషియా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్, ఇతర ప్రతినిధులు