తెలంగాణ

ఐటీ హబ్‌గా వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తర్వాత అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరానికి రావడానికి ఐటీ కంపెనీలకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ పారిశ్రామిక, ఐటీ కారిడారో ఆదివారం క్యాడ్రంట్ ఐటీ కంపెనీ శంకుస్ధాపన కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడిన వంశీరెడ్డి తన సొంత గడ్డపై ఉన్న అభిమానంతో వరంగల్‌కు ఐటీ కంపెనీ తీసుకురావాలి, ఇక్కడ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ముందుకు రావడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. పెద్ద, పెద్ద ఐటీ కంపెనీలు నేడు హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణానికి రావాలని చూస్తున్నాయని వారందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌పై ఉన్న మక్కువతో ఈ నగరాన్ని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేశారన్నారు. అదేవిధంగా ఐటీ, పురపాక శాఖ మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్ తర్వాత ఐటీ కంపెనీలను ఎక్కువగా వరంగల్‌కు తీసుకురావడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పారు. ఐటీ అంటే హైదరాబాద్‌కే పరిమితం కాకూడదని గ్రామీణ యువతకు కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఈ రంగంలో కల్పించేందుకు జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీలు నెలకొల్పడానికి ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ చేస్తున్న కృషి వల్లే నేడు జిల్లా కేంద్రాలకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ, ఐటీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా తాము కీలక పాత్ర పోషిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహ్మరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మేయర్ గుండా పకాష్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.
*చిత్రం... క్వాడ్రంట్ ఐటీ కంపెనీకి శంకుస్థాపన చేస్తున్న మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు