తెలంగాణ

అన్ని ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 16: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న అన్నీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు అవసరమైన వైద్య సామాగ్రిని సమకూరుస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో ఉన్న పది పడకల ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచేందుకు రూ.4.75 కోట్ల వ్యయంతో చేపట్టే ఆస్పత్రి అప్‌గ్రేడ్ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ మారుమూల నల్లమల గిరిజన ప్రాంతానికి వైద్య సేవలు అందించేందుకు అచ్చంపేటలో సంచార పాథలాజికల్ లేబరేటరీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూనే వైద్య రంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తున్నారని అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులను పటిష్టపర్చడంతోపాటు ఖాళీగా వున్న వైద్యుల పోస్టులను భర్తీ చేయటం మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నామన్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. పేదలకు ఏమైనా జబ్బులు వస్తే వైద్య ఖర్చు అనుకోకుండా వచ్చి పడే పిడుగులాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు ఖర్చు పెట్టిన నయంకాని జబ్బులు పేదలు తట్టుకోలేరని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉస్మానియా, గాంధీ వంటి ఆస్పత్రులను పూర్తిస్థాయిలో పటిష్టపర్చామన్నారు. ఉప్పునుంతల ఆస్పత్రికి పూర్వం నుంచి ప్రజల ఆదరణ పొందిన ఆస్పత్రిగా గుర్తింపు ఉందన్నారు .అచ్చంపేట మారుమూల నల్లమల ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉప్పునుంతల ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచేందుకు చేపట్టిన పనులను ఆరు నుంచి 8 మాసాలలలో పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు. త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తుందని వెల్లడించారు. దోమలపెంటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కోరుతున్నారని, పీహెచ్‌సీని ఏర్పాటు చేయకున్నా ఆ స్థాయిలో వెసులుబాటు కల్పిస్తామన్నారు. రఘుపతిపేట పీహెచ్‌సీ స్థాయి పెంపు విషయం అవకాశాన్ని బట్టి చేపడుతామన్నారు. టీఎస్‌ఎంఎస్‌డీసీ చైర్మన్ మర్యాద కృష్ణమూర్తి మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలో ఉండే ప్రజలకు మంచి సేవలు అందించేలా ఉప్పునుంతల ఆస్పత్రిని తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి, ఎంపీ పోతుగంటి రాములు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్