తెలంగాణ

రూ. 9 కోట్లకు చేరువలో మేడారం హుండీ ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 16: మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ హుండీల లెక్కింపు గత ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. మొత్తం 494 హుండీలకు ఇప్పటివరకు 341 హుండీలను లెక్కించగా రూ. 8 కోట్ల 76 లక్షల 37 వేల ఆదాయం వచ్చింది. మరో మూడు రోజుల పాటు ఈ హుండీల లెక్కింపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. భారీ పోలీస్ భద్రత మధ్య మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. గత ఏడాది మేడారం హుండీల లెక్కింపు ద్వారా 10 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈసారి దాదాపు 15 కోట్ల ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.