తెలంగాణ

ఎన్పీఆర్‌తో ప్రజల్లో భయాందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్రం తీసుకువచ్చిన ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిష్టర్) చట్టంతో తెలంగాణ ప్రజల్లో భయాందోళన వ్యక్తం అవుతోందని, వీటిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని టీఎస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్పీఆర్‌లో 31 రకాల అంశాలపై ప్రజల్లో అపోహలు నెలకొన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్పీఆర్‌లో కుటుంబం, వ్యక్తిగత వివరాలను సేకరించడానికి సంబంధిత చట్టంలో ఉన్నందున ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఎన్పీఆర్‌లో పేర్కొన్నట్లుగా 31 రకాల ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు. ప్రజల్లో ఉన్న అపోహాలు, అనుమానాలకు తావివ్వకుండా తక్షణ జనాభా గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్పీఆర్ సేకరించిన అంశాల్లో చిన్నా, మధ్య తరగతులు పొందుతున్న రాయితీ లబ్ధిని తొలగిస్తారన్న ఆందోళన ఉందన్నారు. బీసీ గణనపై కేంద్రానికి లేఖ రాయాలని ఆయన కేసీఆర్‌కు సూచించారు. 2014 ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి ఎన్ దుర్గాప్రసాద్ కూడా పాల్గొన్నారు.