తెలంగాణ

ముందంతా వెలుగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 5: విద్యుత్‌రంగంలో తెలంగాణను మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ కృషిలో భాగంగానే 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసినట్టు ప్రకటించారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో 2018 నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మంగళవారం వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని గణపురం మండలం చెల్పూరులో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు -2 కింద 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ నుంచే పగటిపూట రైతులకు 9 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. కనురెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటలు విద్యుత్ అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. కాళేశ్వరం దగ్గర బ్యారేజీ నిర్మాణ పనులు వెంటనే చేపడుతున్నట్టు వెల్లడించారు. భీంఘన్‌పూర్‌లో త్వరలోనే లిఫ్ట్ ఇరిగేషన్‌కు పునాదులు వేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఏటా ఇరిగేషన్‌కు రూ.25వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైందని, గతంలో తెలంగాణలో కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వచ్చేలా కట్టకపోవడం వల్లే ప్రాజెక్టుల దుస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. అందుకే తాను ప్రతి ప్రాజెక్టును సద్వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. భీంఘన్‌పూర్‌లో లిఫ్ట్ ఏర్పాటుకు జనవరిలోనే నిధులు కేటాయించి ఫిబ్రవరి నుంచి ఫలితాలు వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. వరంగల్ జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయని, ఎల్‌ఎండి కాల్వ ద్వారా 8వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేందుకు 130 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టామన్నారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కళ్యాణలక్ష్మి అందిస్తామని సిఎం ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులను బానిసలుగా చూసేవారని, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడికి గురయ్యేవారన్నారు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించానని, త్వరలోనే విద్యుత్‌చ్ఛక్తి రంగంలో పని చేసే ఔట్‌సోర్సింగ్ కార్మికులకూ శుభవార్త అందిస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతేకాకుండా సిజెఎల్‌ఎంలను తక్షణమే రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమేనని, హిందూ, ముస్లిం, క్రైస్తవుల మనోభావాలను గుర్తించే దసరా, బతుకమ్మలను రాష్ట్ర పండువగా చేశామని, రంజాన్ రోజున ఇఫ్తార్‌విందు, క్రిస్మస్ రోజున పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. వందశాతం ప్రజల దీవెనలతో బంగారు తెలంగాణ సాధించి తీరుతామన్నారు. కార్యక్రమానికి స్పీకర్ మధుసూధనాచారి అధ్యక్షత వహించగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... కెటిపిపిలో విద్యుదుత్పత్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిఎం కెసిఆర్