తెలంగాణ

సొంత రాష్ట్రంలో ఓటు వేయడం తప్పా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్‌లో ఓటర్‌ను, మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడినైనా తాను తెలంగాణలో ఓటు వేయడం తప్పేలా అవుతుందని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తెలంగాణలో ఓటు వినియోగించుకోవడం పట్ల ప్రతిపక్షాలు తప్పు పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం కలిసి కేకే వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తుక్కుగూడ మున్సిపాలిటీలో తాను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యలో వివరణ ఇవ్వడానికి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రాజ్యసభ సభ్యుల విభజన కూడా జరిగిందని ఆయన తెలిపారు. ఆ సందర్భంగా తనను ఏపీకి, కెవిపి రామచంద్రరావును తెలంగాణకు కేటాయించారన్నారు. అయితే తాము ఇద్దరం పరస్పరం రాష్ట్రాలు మార్చుకుంటూ అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు లేఖలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు 2014లోనే గెజిట్ విడుదల అయిందన్నారు. అలాంటప్పుడు తమ ఇద్దరికి తెలంగాణలోనే ఓటు వేసే అవకాశాన్ని ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. తానైనా జిహెచ్‌ఎంసి పరిధిలో ఓటర్‌ను కానీ కేవీపీకి ఇక్కడ ఓటే లేదన్నారు. అలాంటప్పుడు నేరుడుచర్లలో కేవీపీకి ఓటు వేసే అవకాశం కల్పించడం సరికాదన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరణ ఇచ్చినట్టు కేకే తెలిపారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు నిర్ణయంపై మీడియా ప్రశ్నించగా తాను వ్యక్తిగతంగా ఈ నిర్ణయానికి వ్యతిరేకమన్నారు.
మండలిపై పెట్టే ఖర్చు వృధా అనడం నా దృష్టిలో నాన్స్‌న్స్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాలను సాధారణంగా కేంద్రం ఆమోదిస్తుందని చెప్పారు.
*చిత్రం...టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు