తెలంగాణ

కాలుష్య నివారణ నిధుల వినియోగానికి ఉన్నతస్థాయి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: పటన్‌చెరు, బొల్లారం ప్రాంతాల్లో కాలుష్య నివారణ కోసం ఏర్పాటు చేసిన ‘ఎన్విరాన్‌మెంట్ రిలీఫ్ ఫండ్’ వినియోగానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో మంగళవారం జీఓ జారీ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు తొమ్మిది మంది ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. పర్యావరణ, అడవుల శాఖ, నీటిపారుదల శాఖ, పరిశ్రమల శాఖ, పంచాయితీరాజ్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బాటనీ విభాగం ప్రొఫెసర్ నిర్మల బాబూరావు, బల్క్ డ్రగ్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వి.వి. కృష్ణారెడ్డి, సొసైటీ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వైస్-ప్రెసిడెంట్ పి. జనార్దన్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు.