తెలంగాణ

చైర్‌పర్సన్ ఎన్నికల్లో ఘర్షణలు..అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 27: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తత మధ్య సాగాయి. చౌటుప్పల్ మున్సిపాల్టీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా సీపీఎం సభ్యులు ముగ్గురు కాంగ్రెస్‌కు జలక్ ఇచ్చి టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడంతో స్థానిక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాంతో ఆందోళనకు దిగడం ఘర్షణలకు దారితీసింది. చౌటుప్పల్ మున్సిపాల్టీలో 20 స్థానాలుండగా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సీపీఎం సభ్యులు ముగ్గురు కౌన్సిలర్లుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఐదుగురు, వారి మద్దతుతో మరో ఇండిపెండెంట్, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఓటుతో కలిపి కాంగ్రెస్ ఓట్ల సంఖ్య పదికి చేరుకుంది. బీజేపీ నుండి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. టీఆర్‌ఎస్‌కు ఎనిమిది మంది కౌన్సిలర్ల బలం మాత్రమే ఉంది. అయితే చైర్మన్ ఎన్నిక సందర్భంగా సీపీఎం సభ్యులు ముగ్గురు టీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థి వెన్‌రెడ్డి రాజుకు మద్దతు పలకడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న సమావేశం హాల్‌లోకి దూసుకెళ్లి టేబుళ్లపైన ఉన్న ఎన్నికల పత్రాలను చించివేసి సీపీఎం సభ్యులపై దూసుకెళ్లి వారితో ఘర్షణకు దిగారు. కాంగ్రెస్ ఓట్లతో గెలిచి టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారంటూ దొంగ కమ్యూనిస్టులంటూ ఆయన సీపీఎం సభ్యులపై తిట్ల వర్షం కురిపించారు. పోలీసులు రాజగోపాల్‌రెడ్డిని అడ్డుకుని బయటకు తీసుకవచ్చి జీపులో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు జీపుకు అడ్డం పడగా పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, సీపీఎం కార్యాలయంపైన రాళ్లు రువ్వారు. సీపీఎం కౌన్సిలర్ సభ్యుల ఇళ్లపై కూడా రాళ్లు రువ్వారు. పోలీసులు అరెస్టు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని చండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీజేపీ సభ్యులు ముగ్గురు తటస్థ వైఖరితో వాకౌట్ చేసి వెళ్లగా, సీపీఎం సభ్యుల మద్దతుతో టీఆర్‌ఎస్‌కు చెందిన వెన్‌రెడ్డి రాజు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌కు సీపీఎంకు చెందిన బత్తుల శ్రీశైలంను ఎన్నుకున్నారు. మరోవైపు నేరేడుచర్ల మున్సిపాల్టీలో ఎక్స్‌అఫిషియో ఓట్ల వివాదం ఉద్రిక్తతలు రేపింది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఏడు, మిత్రపక్షం సీపీఎంకు ఒకరు, ఎక్స్‌అఫిషియో ఓటర్లుగా ఎంపీలు ఉత్తమ్, కేవీపీ ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు ఏడుగురు కౌన్సిలర్లు, ఎక్స్‌అఫిషియో ఓటర్లుగా ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బొడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. ఎన్నికకు ముందు రోజు ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు కే.వి.పి.రామచందర్‌రావు ఓటుకు అనుమతించి తదుపరి నిరాకరించడంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదే రోజు ఆదివారం రాత్రి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చివరకు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కేవీపీ ఓటుకు అనుమతిస్తూఆదేశాలివ్వడంతో వివాదం సద్దుమణుగుతుందని భావించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సోమవారం చైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిల్ సమావేశం ప్రారంభంకాగానే ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి, ఉత్తమ్‌కు మధ్య వాగ్వివాదం రేగింది. ఇరువర్గాల మధ్య సమావేశంలో తోపులాట రేగడంతో ఎన్నికల అధికారి కిరణ్ సాయంత్రం 4 గంటలకు సమావేశాన్ని వాయిదా వేశారు. ఆ సమయానికి కాంగ్రెస్ ఓటర్లంతా సమావేశానికి హాజరైనప్పటికీ, టీఆర్‌ఎస్ ఓటర్లు గైర్హాజరవ్వడంతో ఎన్నిక ప్రక్రియను నేటి మంగళవారానికి వాయిదా వేశారు. నేడు కూడా చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి వివాదాలు రేగుతాయోనని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
*చిత్రాలు.. చౌటుప్పల్‌లో లాఠీచార్జి చేస్తున్న పోలీసులు
*రాళ్లు రువ్వుతున్న కార్యకర్తలు
*నేరేడుచర్లలో ఉత్తమ్, కేవీపీలను అడ్డుకుంటున్న పోలీస్ అధికారులు