తెలంగాణ

బల్దియాల్లో తెరాస జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 27: మున్సిపల్ ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో తెరాస పాగా వేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో 15 పురపాలికల్లో టీఆర్‌ఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు గెలుపొందారు. మక్తల్‌లో పురపాలికలో బీజేపీ, వడ్డేపల్లి ము న్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్లు కైవసం చేసుకున్నారు. కాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులకు మాత్రం చుక్కెదురైంది. మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్టీకి సంబందించిన కోరమోని నరసింహులు, వైస్ చైర్మన్‌గా గణేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. కల్వకుర్తి పురపాలిక చైర్మన్‌గా తెరాసకు చెందిన ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్‌గా సాహెద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గద్వాల మున్సిపల్ చైర్మన్‌గా బిఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తకోట మున్సిపల్ చైర్మన్‌గా సుఖేసిని, వైస్ చైర్మన్‌గా జయమ్మ, పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్‌గా కరుణశ్రీ, వైస్ చైర్మన్‌గా కర్రెసామి, నాగర్‌కర్నూల్ పురపాలిక చైర్మన్‌గా కల్పన, వైస్ చైర్మన్‌గా భాస్కర్‌రావు, వనపర్తి మున్సిపల్ చైర్మన్‌గా గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీ్ధర్, ఆత్మకూర్ చైర్మన్‌గా గాయిత్రి, వైస్ చైర్మన్‌గా విజయభాస్కర్‌రెడ్డి, అయిజ పురపాలిక చైర్మన్‌గా తెరాసకు చెందిన చిన్నదేవన్న, వైస్ చైర్మన్‌గా నరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నారాయణపేట పురపాలిక చైర్మన్‌గా గంజి అనుసూయ, వైస్ చైర్మన్‌గా హరినారాయణభట్, అలంపూర్ పురపాలిక చైర్మన్‌గా తెరాసకు చెందిన మనోరమ, వైస్ చైర్మన్‌గా శేఖర్‌రెడ్డి, భూత్పూర్ పురపాలిక చైర్మన్‌గా తెరాసకు చెందిన బస్వరాజ్‌గౌడ్, వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాసులు ఏకగ్రీవం అయ్యారు. కాగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సైతం విజయలక్ష్మీ, వైస్ చైర్మన్ మహముదాబేగం గెలుపొందారు. అదేవిధంగా కోస్గిలో సైతం తెరాసకు చెందిన చైర్మన్‌గా శీరిష, వైస్ చైర్మన్‌గా అన్నపూర్ణలు గెలుపొందారు. కొల్లాపూర్, కోస్గి పురపాలికలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిసియో సభ్యుల ఓట్లతో రెండింటిని తెరాస కైవసం చేసుకుంది. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులకు చుక్కెదురైంది. కోస్గిలో కూడా కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న ఆశలు గల్లంతైయ్యాయి. ఇక ఆమరచింత పురపాలికలో ఇద్దరు సీపీ ఎం వార్డు సభ్యుల సహకారంతో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మంగమ్మ చైర్మన్ కాగా, వైస్ చైర్మన్‌గా సీపీఎంకు చెందిన జిఎస్ గోపిలు ఏకగ్రీవమయ్యారు. ఇక మక్తల్ మున్సిపల్ చైర్మన్‌గా బీజేపీ పార్టీకి చెందిన పావని, వైస్ చైర్మన్‌గా అఖిల గెలుపొందారు. అయితే ఇక్కడ టీఆర్‌ఎస్ ఎత్తులను బీజేపీ నేతలు తిప్పికొట్టి అనూహ్యరితీలో బీజేపీ మక్తల్ పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. ఇకపోతే వడ్డేపల్లి ము న్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్‌ఎస్ కరుణశ్రీ, వైస్ చైర్మన్‌గా సుజాతలు ఏకగ్రీవమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15 మున్సిపల్ చైర్మన్లను తెరాస కైవసం చేసుకోగా బీజేపీ-1, కాంగ్రెస్-1 చైర్మన్ పీఠాలను దక్కించుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్లీన్‌స్వీప్
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తిరుగులేని శక్తిగా అవతరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీ పీఠాలను స్వీప్ చేసింది. ఎన్నికలు జరిగిన తొమ్మిది మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల చైర్మన్, చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరిగాయి. తొమ్మిది మున్సిపల్ చైర్మన్, చైర్‌పర్సన్లతో పాటు వైస్‌చైర్మన్ స్థానాలను టీఆర్‌ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఒక్క జనగామ, మహబూబాబాద్ మున్సిపాలటీలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల మున్సిపల్ చైర్మన్‌గా సోదా అనిత, వైస్ చైర్మన్‌గా రేగూరి జైపాల్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కొత్తగా ఏర్పాటు అయిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా అంగోతు అరుణ, వైస్ చైర్మన్‌గా కొమాండ్ల ఎలెందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా గుంటి రజిని, వైస్ చైర్మన్‌గా మునిగాల వెంకట్‌రెడ్డి, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌గా సెగం వెంకటరాణి, వైస్ చైర్మన్‌గా కొత్త హరిబాబు ఎన్నికయ్యారు. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా మహ్మద్ ఫరీద్, మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్‌గా గుగులోతు సిందూర, వైస్ చైర్మన్‌గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్‌గా వంకుడోతు వీరన్న, వైస్ చైర్మన్‌గా కేశబోయిన కోటిలింగం ఎన్నికైయ్యారు. తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా మంగళపల్లి రాంచంద్రయ్య, వైస్ చైర్మన్‌గా జినుగు సురేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌పై చేయ..్భంసాలో మళ్లీ ఎంఐఎం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పది మున్సిపాలిటీ పీఠాల్లో టీఆర్‌ఎస్ పాగా వేసింది. సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, కొత్త కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముగియడంతో కొత్త పాలకవర్గాలు అట్టహాసంగా కొలువుదీరాయి. భైంసా మున్సిపాలిటీలో ఈసారి కూడా ఎంఐఎం పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ప్రాతినిథ్యం వహించనుంది. చైర్‌పర్సన్‌గా మజ్లిస్ పార్టీ నుండి సబియాబేగం, వైస్ చైర్మెన్‌గా అదే పార్టీ నుండి జాబిర్ ఆహ్మద్ ఎన్నికయ్యారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే నిర్మల్‌లో సంపూర్ణ మెజార్టీ కలిగి ఉన్న టీఆర్‌ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది.
చెర్మన్‌గా గండ్రత్ ఈశ్వర్, వైస్ చైర్మన్‌గా సాజిద్ ఎన్నిక కాగా ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగురామన్న తనయుడు జోగు ప్రేమేందర్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించగా, వైస్ చైర్మన్‌గా అదే పార్టీలోని జహీర్ రంజాని ఎన్నికయ్యారు. ఆదిలాబాద్‌లో చైర్మన్ ఎన్నికకు ఒక ఓటు తక్కువగా ఉండడంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వగా ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే జోగురామన్న ఓటు వేశారు. కొత్తగా ఏర్పడ్డ ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడినప్పటికీ చైర్మన్ పదవి కోసం ఉత్కంఠత నెలకొంది. టీఆర్‌ఎస్ పక్కా వ్యూహం రూపొందించడంతో కాంగ్రెస్ అభ్యర్థి సంకీర్తన గైర్హాజరు కాగా స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో పాటు ఎమ్మెల్యే రేఖానాయక్ ఎక్స్‌అఫిషియో సభ్యురాలిగా ఓటు వేయడంతో మ్యాజిక్‌ఫిగర్ 12కు చేరుకోవడంతో చైర్మెన్, వైస్ చైర్మెన్ పదవులు టీఆర్‌ఎస్‌కు వరించాయి. చైర్మెన్‌గా అంకం రాజేందర్, వైస్ చైర్మెన్‌గా అబ్దుల్ ఖలీం ఎన్నికయ్యారు. కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ నుండి చైర్మెన్‌గా సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్‌గా గిరీష్ కుమార్ ఎన్నికకాగా లక్సెటిపేటలో టీఆర్‌ఎస్‌కు చెందిన చైర్మెన్ నలమాసుకాంతయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికయ్యారు. మంచిర్యాల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ నుండి చైర్మన్‌గా పెంట రాజయ్య, వైస్ చైర్మన్‌గా గాజుల ముఖేష్‌గౌడ్, నస్పూర్‌లో చైర్మన్‌గా ప్రభాకర్, వైస్ చైర్మన్‌గా తోట శ్రీనివాస్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ నుండి చైర్మన్‌గా జంగం కళావతి, వైస్ చైర్మన్‌గా ఎర్రం విద్యాసాగర్ రెడ్డి ఎన్నికయ్యారు. చెన్నూరు మున్సిపాలిటీలో చైర్మన్‌గా అర్చనగిల్డ, వైస్ చైర్మన్‌గా నవాజొద్దీన్ టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికయ్యారు. బెల్లంపల్లిలో చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన జక్కుల శే్వత చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాగా వైస్ చైర్మన్‌గా బత్తుల సుదర్శన్ ఎన్నికయ్యారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో క్లీన్ స్వీప్
సంగారెడ్డి: మొదటి నుండి ఏకపక్షంగా సాగిన పురపాలికల ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నెల 22వ తేదీన నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వార్డుల నుండి పోటీ చేసిన మెజార్టీ స్థానాల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. 25వ తేదీన ఫలితాలు వెలువడిన వెనువెంటనే గెలుపొందిన అభ్యర్థులు చేజారీఒపోకుండా నూతన కౌన్సిలర్లను రాజకీయ శిబిరాలకు తరలించారు. టీఆర్‌ఎస్ అధిష్టానం, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన వారినే చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉండగా కోర్టులో కేసు పెండింగ్ ఉండటంతో జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించకపోగా, సిద్దిపేట పాలకవర్గం పదవి కాలం ఇంకా మిగిలివుంది. మిగిలిన 15 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించింది. సోమవారం నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. ఐడీఏ బొల్లారంలో రెండుగా చీలిపోయిన టీఆర్‌ఎస్‌లో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బొంగుల విజయలక్ష్మీ, వైస్ చైర్‌పర్సన్‌గా శంకరి లతా విజయేందర్‌రెడ్డి, సదాశివపేట చైర్‌పర్సన్‌గా పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్‌గా చింతా గోపాల్, నారాయణఖేడ్‌లో చైర్‌పర్సన్‌గా రుబీనా బేగం, వైస్ చైర్మన్‌గా పరుశురాం, అందోల్-జోగిపేటలో చైర్మన్‌గా గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్‌గా మ్యాతరి ప్రవీన్‌కుమార్, తెల్లాపూర్‌లో చైర్‌పర్సన్‌గా మల్లేపల్లి లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్‌గా రాములుగౌడ్, అమీన్‌పూర్‌లో చైర్మన్‌గా తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్‌గా నందారం నరసింహాగౌడ్, బొల్లారంలో చైర్‌పర్సన్‌గా కొలను రోజారాణి, వైస్ చైర్మన్‌గా అంతిరెడ్డిగారి అనీల్‌రెడ్డి, మెదక్ చైర్మన్‌గా తొడుపునూరి చంద్రపాల్, వైస్‌చైర్మన్‌గా ఆరెల్ల మల్లికార్జున్‌గౌడ్, నర్సాపూర్ చైర్మన్‌గా ఎర్రగొల్ల మురళీధర్ యాదవ్, వైస్ చైర్మన్‌గా ఎండీ.నరుూమొద్దీన్, తూప్రాన్ చైర్మన్‌గా బొంది రాఘవేందర్‌గౌడ్, వైస్ చైర్మన్‌గా నందాల శ్రీనివాస్, రామాయంపేట చైర్మన్‌గా పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్‌పర్సన్‌గా పుట్టి విజయలక్ష్మీ, దుబ్బాక చైర్‌పర్సన్‌గా గనె్న వనిత, వైస్ చైర్‌పర్సన్‌గా అధికం సుగుణ, చేర్యాల చైర్‌పర్సన్‌గా అంకుగారి స్వరూపరాణి, వైస్ చైర్మన్‌గా నిమ్మ రాజీవ్‌కుమార్‌రెడ్డి, గజ్వేల్‌లో చైర్మన్‌గా రాజవౌళి, వైస్ చైర్మన్‌గా జకీరోద్దీన్, హుస్నాబాద్ చైర్‌పర్సన్‌గా ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్‌గా అయిలేని అనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉమ్మడి నల్లగొండలో కారు జైత్రయాత్ర
నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాల్టీల్లో సోమవారం నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల్లో 16 మున్సిపాల్టీలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ చండూర్ మున్సిపాల్టీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను మాత్రమే దక్కించుకోగలిగింది. నేరడుచర్ల మున్సిపాల్టీలో రాజ్యసభ సభ్యుడు కేవిపి రామచందర్‌రావు ఓటు అనుమతి వివాదం నేపథ్యంలో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తొమ్మిదింటిలో మాత్రమే స్పష్టమైన మెజార్టీ రాగా, మూడింటిలో కాంగ్రెస్‌కు, ఆరింటిలో హంగ్ ఏర్పడింది. అయితే అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎక్స్‌అఫిషియో ఓట్ల ఎత్తుగడ అస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించడంతో పాటు ప్రత్యర్ధి పార్టీల్లో చీలికలు, వలసలను ప్రోత్సహించడం ద్వారా 16 మున్సిపాల్టీల చైర్మన్ పీఠాలను కైసవం చేసుకోగలిగింది. నల్లగొండ మున్సిపల్ చైర్మన్‌గా మందడి సైదిరెడ్డి (టీఆర్‌ఎస్) ఎన్నికవ్వగా, వైస్ చైర్మన్ ఎన్నిక నేటి మంగళవారానికి వాయిదా పడింది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్‌గా తిరునగరి భార్గవ్ (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా కుర్ర కోటేశ్వర్‌రావు (టీఆర్‌ఎస్), దేవరకొండ చైర్మన్‌గా అలంపల్లి నర్సింహ (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా ఎండి.రహత్‌అలీ (టీఆర్‌ఎస్), హాలియా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వెంపటి పార్వతమ్మ (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్ (టీఆర్‌ఎస్), నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్‌గా కర్న అనూషా (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా మంద రఘువీర్ (టీఆర్‌ఎస్), చండూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా పోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ చైర్మన్‌గా దోటి సుజాత (కాంగ్రెస్), చిట్యాల మున్సిపాల్టీ చైర్మన్‌గా కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా కూరెళ్ల లింగస్వామి (టీఆర్‌ఎస్) ఎన్నికయ్యారు.
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపాల్టీ చైర్‌పర్సన్‌గా పెరుమాళ్ల అన్నపూర్ణ (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా పొట్ట కిషోర్ (టీఆర్‌ఎస్), హుజూర్‌నగర్ చైర్‌పర్సన్‌గా గెల్లి అర్చనరవి (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా జక్కుల నాగేశ్వర్‌రావు (టీఆర్‌ఎస్), తిరుమలగిరి చైర్ పర్సన్‌గా పోతరాజు రజిని (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా సంకపల్లి రఘునందన్‌రెడ్డి (టీఆర్‌ఎస్), కోదాడ చైర్‌పర్సన్‌గా వనపర్తి శిరీష (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా వెంపటి పద్మావతి (టీఆర్‌ఎస్) ఎన్నికయ్యారు. నేరడుచర్ల మున్పిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేటీకి వాయిదా పడింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో
భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎనబోయిన ఆంజనేయులు (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా చింతల కిష్టయ్య (టీఆర్‌ఎస్), భూదాన్ పోచంపల్లి చైర్ పర్సన్‌గా చిట్టిపోలు విజయలక్ష్మి (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా బాత్క లింగస్వామి (టీఆర్‌ఎస్), మోత్కూర్ చైర్‌పర్సన్‌గా తిపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా బొల్లపల్లి వెంకటయ్య (టీఆర్‌ఎస్), చౌటుప్పల్ చైర్మన్‌గా వెన్‌రెడ్డి రాజు (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా బత్తుల శ్రీశైలం (సీపీఎం), ఆలేరు మున్సిపల్ చైర్మన్‌గా వనపరి శంకరయ్య (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా మొరిగాడి మాధవి, యాదగిరిగుట్ట చైర్‌పర్సన్‌గా ఎరుకల సుధ (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా మేడబోయిన కాటం రాజు (టీఆర్‌ఎస్ రెబల్) ఎన్నికయ్యారు.