తెలంగాణ

టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ల ఎన్నికల్లో తొమ్మిదింటికి తొమ్మిదిలోనూ టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. డిప్యూటీ మేయర్ల పదవులకు సంబంధించి నిజామాబాద్ డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు కట్టబెట్టారు. నిజామాబాద్‌లోని 60 వార్డుల్లో అత్యధిక స్థానాల్లో అంటే 28 వార్డు స్థానాల్లో బీజేపీ అభ్యర్యులు కార్పొరేటర్లుగా గెలిచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక్కడ 13 స్థానాలు దక్కించుకున్న
టీఆర్‌ఎస్ 16 స్థానాలు కైవసం చేసుకున్న ఎంఐఎంతో కలవడంతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులను రంగంలోకి దించి మేయర్ స్థానాన్ని చేజిక్కించుకుంది. టీఆర్‌ఎస్‌కు చెందిన దండు నీతూ కిరణ్‌కు నిజామాబాద్ మేయర్ పదవి దక్కింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవి కూడా టీఆర్‌ఎస్‌కే దక్కేందుకు వీలుగా అఖండ విజయం లభించింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో కౌంటింగ్ సోమవారం జరిగింది. ఇక్కడ 60 వార్డు స్థానాలు ఉండగా 33 స్థానాలు టీఆర్‌ఎస్‌కు, 13 స్థానాలు బీజేపీకి, 6 స్థానాలు ఎంఐఎంకు, మూడు స్థానాలు ఫార్వర్డ్ బ్లాక్‌కు దక్కగా, స్వతంత్ర అభ్యర్థులు ఐదు స్థానాలను దక్కించుకున్నారు. అంటే బీజేపీ ఎవరి సహకారం అవసరం లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకునే అవకాశం లభించింది. ఫార్వర్డ్‌బ్లాక్, స్వతంత్ర అభ్యర్థుల్లో చాలావరకు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలిపే అవకాశం ఉందని తెలిసింది. ఈ నెల 29న కరీంనగర్ నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహిస్తామని సంబంధిత రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇలాఉండగా రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల్లో 110 మున్సిపల్ చైర్‌పర్సన్ల పదవులను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ నాలుగు (వడ్డేపల్లి, మణికొండ, చండూరు, తుర్కయాంజాల్) మున్సిపల్ చైర్‌పర్సన్ల స్థానాలను దక్కించుకుంది. బీజేపీకి రెండు (ఆమన్‌గల్, మక్తల్) మున్సిపల్ చైర్‌పర్సన్ల స్థానాలు దక్కాయి. ఎంఐఎం రెండు మున్సిపల్ (బైంసా, జల్‌పల్లి) చైర్‌పర్సన్ల స్థానాలను కైవసం చేసుకుంది.
రెండు వాయిదా
నేరేడుచర్ల, మేడ్చల్ మున్సిపల్ స్థానాల చైర్‌పర్సన్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ రెండు స్థానాల్లో మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తారు.