తెలంగాణ

మొరాయించిన జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భార త గణతంత్ర దినోత్సవం సందర్భం గా రాష్టస్థ్రాయిలో ఏర్పాటు చేసిన ఉత్సవం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎగురవేసిన జాతీయ జెండా కొద్దిసేపు మొరాయించింది. షెడ్యూల్ ప్రకారమే ఆదివారం ఉద యం 10.30 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌కు వచ్చిన గవర్నర్‌కు ముఖ్యమం త్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. వేదిక వద్దకు గవర్నర్ రాగానే వేదిక ఎదురుగా ఉన్న జాతీయ జెండాను ఎగురవేసేం దుకు ఉద్యుక్తులయ్యారు. రాడ్‌కు కట్టిన జాతీయ జెండాను కింది నుం డి పైకి లాగిన తర్వాత వేసిన ముడిని విడదీసే క్రమంలో అది మొరాయించింది. ఎంత ప్రయత్నించినా ముడి వీడలేదు. సాధారణంగా రాడ్‌పైకి జెండా వెళ్లిన తర్వాత ముడివిడిపోయేలా చేసి, అందులో ఉంచిన పూ లు, రంగు కాగితాలు గాల్లోకి వెదజల్లేలా ఏర్పాటు చేస్తారు. గవర్నర్ తమిళిసై ఎగురవేసిన జాతీయ జెం డా రాడ్‌పైకి వెళ్లిన తర్వాత ముడివీడకపోవడంతో కొన్ని క్షణాలు ఇబ్బందికరంగా గడిచాయి. గవర్నర్ కూడా అసహనానికి గురయ్యారు. ముడివీడని జెండాను గవర్నర్ అలాగే వదిలివేసి వేదికపైకి వచ్చారు. జెండాను ఏర్పాటు చేసిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ విధమైన పరిస్థితి ఏర్పడ్డట్టు తెలిసింది. గవర్నర్ వేదికపైకి వచ్చిన తర్వాత సిబ్బంది మళ్లీ ఆ జెండాను కిందకు దించి, ముడి విప్పి ఎగిరేలా చేశారు.