తెలంగాణ

ఇక ‘పట్టణ ప్రగతి’*

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: రాష్టవ్య్రాప్తంగా ఇటీవల చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఏవిధంగా అమలవుతుందో, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తమ పరిధిలో విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలోనే తాను గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై కేసీఆర్ ఆదివారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా కొంతమంది మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధు లు, అధికారులు తామే గ్రామాల్లో ఊడుస్తున్నట్టు పేపర్లలో వచ్చేలా ఫొటోలకు ఫోజులిస్తున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. మంత్రులు, కలెక్టర్లు తదితరులు ఉన్నది చీపుళ్లు పట్టి ఊడ్చేందుకు కాదు.. ఈ పనిచేసేందుకు ప్ర త్యేక సిబ్బంది ఉన్నారన్నారు. పారిశుద్ధ్య సి బ్బంది బాగా పనిచేయాలన్న ఉద్దేశంతో వా రి వేతనాలు కూడా పెంచామన్నారు. మంత్రు లు, కలెక్టర్లు తదితరులు తమ విధి నిర్వహణ సక్రమంగా చేస్తే సరిపోతుందని ఆయన సూచించారు. కింది స్థాయి సిబ్బంది చేత బా గా పనిచేయిస్తే చాలన్నారు. పారిశుద్ధ్యం అన్నది ఒక్కరోజుతో అయిపోయేది కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు.
పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల గురించి ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా అధికారులతో వివరంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, అటవీ శాఖ రాష్ట్ర అధికారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'చిత్రం... పల్లె ప్రగతి కార్యక్రమంపై ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్